ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కనుమనాడు బౌద్ధ ఉత్సవం

ABN, First Publish Date - 2022-01-14T05:11:52+05:30

పండుగలు అనేక రూపాల్లో ఉంటాయి. అనేక కారణాలతో మనం చేసుకొనే పండుగల్లో... పంటల పండుగ సంక్రాంతి. దాదాపు పదిహేను వందల సంవత్సరాలు తన ప్రభావాన్ని సమాజంపై బలీయంగా వేసిన బౌద్ధం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పండుగలు అనేక రూపాల్లో ఉంటాయి. అనేక కారణాలతో మనం చేసుకొనే పండుగల్లో... పంటల పండుగ సంక్రాంతి. దాదాపు పదిహేను వందల సంవత్సరాలు తన ప్రభావాన్ని సమాజంపై బలీయంగా వేసిన బౌద్ధం ప్రసరింపజేసిన అహింస, ప్రకృతి పట్ల ప్రేమ, మానవీయత మన పండుగల్లో కనిపిస్తూనే ఉంటాయి. అలాంటి వాటిలో ‘బొజ్జన్న కొండ కనుమ ఉత్సవాలు’ ఒకటి. 


తెలుగు రాష్ట్రాల్లో అమరావతి, భట్టిప్రోలు, నాగార్జున కొండలకు ఎంతటి ప్రాధాన్యం ఉందో... అనకాపల్లికి దగ్గరలోని బొజ్జన్న కొండకూ అంత ప్రాధాన్యం ఉంది. బౌద్ధ ఆరామాలున్న అన్ని నదీ తీరాలలో చెరుకు సాగు వ్యాపించింది. భట్టి ప్రోలు, ఘంటసాలతో పాటు బొజ్జన్న కొండ ప్రాంతం అటు వరికి, ఇటు చెరుకుకు ప్రధాన క్షేత్రంగా ఇప్పటికీ భాసిల్లుతోంది. వరి పంటతో పాటు చెరుకు దిగుబడి కూడా ఈ నెలలో చేతికి అంది వస్తుంది. అందుకే కనుమ రోజున బొజ్జన్న కొండ దగ్గర పెద్ద ఉత్సవం జరుగుతుంది. ఏటా కనుమ నాడు... మతాలకు అతీతంగా వేలాదిమంది పాల్గొనే బౌద్ధ ఉత్సవం ఇది. గత దశాబ్ద కాలంగా బౌద్ధులు కూడా ఇక్కడ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆరోగ్యానికీ, పంటలకూ ప్రతీకగా ఈ బౌద్ధ ఉత్సవాన్ని జరుపుకొంటున్నారు. 


దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా వందలాది ఏకశిలా బౌద్ధ స్తూపాలు ఈ కొండమీద ఉన్నాయి. ఇక్కడున్న జంట కొండల్లో ఒక కొండ నిండా స్తూపాలుంటే... రెండో కొండ మీద గుహాలయాలు, బౌద్ధ విహారాలు, ధ్యాన ప్రాంగణం ఉన్నాయి. మరో విశేషమేమిటంటే... ఇక్కడ హారీతి అనే బౌద్ధ వైద్యురాలి విగ్రహం ఉంది. వినాయకుని ప్రతిమ కూడా ఉంది. బుద్ధుణ్ణి వినాయకునిగా భావించి.. జ్ఞానచిహ్నమైన ఏనుగు ఆకారంలో మలచిన ప్రతిమలు ఈనాటికీ తూర్పు బౌద్ధ దేశాల్లో అనేక చోట్ల ఉన్నాయి. అదే సంప్రదాయం ఇక్కడ కూడా కనిపిస్తుంది. హారీతి, వినాయక విగ్రహాలు ఆరామాల్లో ఉండడం మహాయాన, వజ్రయాన బౌద్ధ సంప్రదాయాలకు తార్కాణం. హారీతి బుద్దుని ప్రబోధం వల్ల తన దుష్టత్వాన్ని మానుకొని, వైద్యంతో మాతా శిశు సంరక్షణకు పూనుకొంది. బౌద్ధంలో 24 మంది పరిరక్షకు లుంటారు. వీరిని ‘దమ్మపాలురు’ అంటారు. వారిలో హారీతి ఒకరు. ఆమె పేరుతో అశోకుడు పెషావర్‌లో పెద్ద ఆరామం నిర్మించాడు. పలు దేశాలలో హారీతి విహారాలున్నాయి. పంటలు, సంతాన సాఫల్యత కలిగించే, మాతా శిశువులను సంరక్షించే దేవతగా ప్రపంచమంతా హారీతి పూజలను అందుకొంటోంది. ఈ సంప్రదాయం బొజ్జన్న కొండ దగ్గర కొనసాగుతూనే ఉంది. 



బొజ్జన్న కొండగా పిలిచే ఈ కొండ ఒకటి కాదు... జంట కొండలు. దీన్ని ‘బుద్ధన్న కొండ’గా పిలిచేవారు. బౌద్ధ జాతికి నిలయంగా ఉన్న ఈ ప్రాంతంలో నేటికీ నాగజాతి ప్రజలు విశేషంగా జీవిస్తున్నారు. ఇక్కడ ‘బుద్ధాన’, ‘బుద్ధా’ అనే ఇంటి పేర్లు ఉన్నవారు ఇప్పటికీ మూడు వంతుల మంది ఉన్నారు. 


బొర్రా గోవర్ధన్‌

Updated Date - 2022-01-14T05:11:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising