ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోతుల ఉపవాసం!

ABN, First Publish Date - 2022-01-28T05:30:00+05:30

ఒక ఊరిలో కోతుల గుంపు ఉండేది. ఒకరోజు కోతులన్నీ మర్రిచెట్టు కిందికి చేరాయి. ఉపవాసం ఉండాలని తీర్మానించుకున్నాయి. కోతుల్లో రాజైన పెద్దకోతి ఇలా అన్నది. ‘మనం ముందు ఆహారం తెచ్చుకుని ఉంచుకుందాం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక ఊరిలో కోతుల గుంపు ఉండేది. ఒకరోజు కోతులన్నీ మర్రిచెట్టు కిందికి చేరాయి. ఉపవాసం ఉండాలని తీర్మానించుకున్నాయి. కోతుల్లో రాజైన పెద్దకోతి ఇలా అన్నది. ‘మనం ముందు ఆహారం తెచ్చుకుని ఉంచుకుందాం. ఉపవాసం అయిపోగానే తినొచ్చు’ అన్నది. ‘అవునవును’ అంటూ యువ కోతులు తీయనైన అరటిపండ్లను తీసుకొచ్చాయి. ‘ముందు తలా ఒక అరటి పండును అందరికీ పంచండి. ఉపవాసం అయిన క్షణమే తినొచ్చ’ని రాజు ఆదేశించాడు. వయసులో ఉండే కోతులు గబగబా అందరికీ పంచాయి. ‘మనం అరటి తొక్కను తీసేసి రెడీగా ఉంచుకుంటే. ఉపవాసం అవుతూనే తినొచ్చ’ని ఓ కోతి చెప్పింది. ‘యస్‌.. యస్‌’ అంటూ మిగతాకోతులన్నీ వంతపాడాయి.


‘సరే’నన్నాడు రాజు. అయితే ఎవరూ తినొద్దని ఆదేశించాడు. సరే... మహారాజా అనుకుంటూ.. అరటిపండు తొక్కను తీసేశాయి. ‘నోటిలో పండును పెట్టుకోవచ్చా? మేం అసలే తినం’ అంటూ ఓ పిల్లకోతి రాజుని అడిగింది. సరేనన్నాడు రాజు. కోతులన్నీ ఒకరి ముఖాలు మరొకరు చూసుకుంటూ అరటి పండును నోట్లో ఉంచాయి. క్షణంలో ఆబగా తినేశాయి. ఎంత తీపిగా ఉందో అంటూ చిందులు తొక్కాయి. ‘మీదేం ఉపవాసం. నా తెలివేం కాను’ అంటూ బాధపడింది కోతుల రారాజు. అట్లా.. కోతుల ఉపవాసం కథ పూర్తయింది.

Updated Date - 2022-01-28T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising