ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏరోబిక్స్‌తో జ్ఞాపకశక్తి!

ABN, First Publish Date - 2022-08-16T06:07:21+05:30

ఏరోబిక్‌ వ్యాయామాల వల్ల జ్ఞాపకశక్తికి సంబంధించిన మెదడులోని కొన్ని ప్రదేశాలకు రక్తప్రసారం పెరిగి, తద్వారా జ్ఞాపకశక్తి మెరుగవుతున్నట్టు పరిశోధనల్లో తేలింది. అల్జీమర్స్‌ డిసీజ్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏరోబిక్‌ వ్యాయామాల వల్ల జ్ఞాపకశక్తికి సంబంధించిన మెదడులోని కొన్ని ప్రదేశాలకు రక్తప్రసారం పెరిగి, తద్వారా జ్ఞాపకశక్తి మెరుగవుతున్నట్టు పరిశోధనల్లో తేలింది. అల్జీమర్స్‌ డిసీజ్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనంలో ఏరోబిక్స్‌తో పెరిగే రక్తప్రసారం వల్ల వృద్ధుల్లో తలెత్తే మతిమరుపు సమస్యలు తగ్గుముఖం పడతాయని పేర్కొన్నారు. ఈ అధ్యయనం ఆధారంగా మెదడులో జ్ఞాపకశక్తితో సంబంధం ఉన్న ప్రదేశాలకు రక్తప్రసారాన్ని మెరుగుపరిచే మందులు కనుగొనడం ద్వారా, అల్జీమర్స్‌ వ్యాధికి చికిత్స అందించే వెసులుబాటు కలిగిందని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సా్‌సకు చెందిన శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.


ఈ అధ్యయనం కోసం 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న 30 మందిపై ప్రయోగాలు జరిగాయి. వీరిలో సగం మందితో ఏడాది పాటు ఏరోబిక్‌ వ్యాయామాలు, మిగతా సగం మందితో సాధారణ వ్యాయామాలు చేయించారు. ఆ ప్రయోగాల్లో ఏరోబిక్‌ వ్యాయామాలు చేసిన వారి మెదడులో రక్తప్రసారాల్లో మార్పులు, తద్వారా జ్ఞాపకశక్తిలో చోటుచేసుకునే తేడాలను పరిశీలించడం జరిగింది.

Updated Date - 2022-08-16T06:07:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising