ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందమైన ముఖానికి 9 సూత్రాలు!

ABN, First Publish Date - 2022-01-29T05:30:00+05:30

మేకప్‌ వేసుకోవటం ఒక కళ. ఏ మాత్రం పొరపాటు జరిగినా ఆకర్షణ దెబ్బ తింటుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేకప్‌ వేసుకోవటం వెనకున్న ముఖ్యమైన సూత్రాలను నేర్చుకుందాం....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేకప్‌ వేసుకోవటం ఒక కళ. ఏ మాత్రం పొరపాటు జరిగినా ఆకర్షణ దెబ్బ తింటుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేకప్‌ వేసుకోవటం వెనకున్న ముఖ్యమైన సూత్రాలను నేర్చుకుందాం..


స్టెప్‌ 1

మాయిశ్చరైజర్‌

మేకప్‌ వేసుకోవటానికి ముందు-  చర్మంలో మృదుత్వం కోసం మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి.  ముఖాన్ని శుభ్రం చేసుకుని, మాయిశ్చరైజర్‌ పూసుకోవాలి. మాయిశ్చరైజర్‌ చర్మం లోపలికి ఇంకే వరకూ ఆగాలి.


స్టెప్‌ 2

ప్రైమర్‌

మేకప్‌ ఎక్కువ సేపు చెదిరిపోకుండా ఉండాలంటే ప్రైమర్‌ తప్పనిసరి. ఇది మన చర్మంపై ఉన్న చిన్న చిన్న గుంటలను కనిపించనివ్వకుండా చేస్తుంది.


స్టెప్‌ 3

కన్‌సీలర్‌

చర్మంపై ఉన్న మచ్చలు.. గుంటలను కనబడని వ్వకుండా చేసేది కన్‌సీలర్‌. చర్మం రంగు కన్నా తక్కువ రంగున్న కన్‌సీలర్‌ను వాడటం మంచిది.


స్టెప్‌ 4

ఫౌండేషన్‌

చర్మం రంగుకు సమానంగా ఫౌండేషన్‌ వాడాలి. బుగ్గలు, నుదురు, గడ్డం మొదలైన ప్రాంతాల్లో కొద్ది, కొద్దిగా ఫౌండేషన్‌ను అప్లై చేసి, ముఖమంతా పరచాలి.


స్టెప్‌ 5

హైలైటర్‌ అండ్‌ బ్రాంజర్‌

ముక్కు, నుదురు, చుబుకం, బుగ్గలను స్పష్టంగా కనిపిం చేలా చేసే హైలైటర్‌ చర్మం రంగు కన్నా.. లేత రంగులో ఉండాలి. బ్రాంజర్‌ ముదురు రంగులో ఉండాలి.


స్టెప్‌ 6

బ్లష్‌

ముఖానికి ఒక మంచి వర్చస్సు రావాలంటే బ్లష్‌ అవసరం. బుగ్గల మీదా, నుదుటి పై భాగంలోను బ్లష్‌ను అప్లై చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. 


స్టెప్‌ 7

ఐబ్రో పెన్సిల్‌ 

 కళ్లు 

అందంగా కనిపించాలంటే ఐబ్రో పెన్సిల్‌ను తప్పనిసరిగా వాడాలి. జుట్టు రంగు కన్నా కొద్దిగా లేత రంగును వాడితే మంచిది.


స్టెప్‌ 8

షాడో, లైనర్‌, మస్కారా

 కనుబొమ్మల కింద లేత రంగు, కనురెప్పల పైన ముదురు రంగు షాడోలను వాడాలి. రెప్పల అంచున ఐలైనర్‌ను వాడాలి. కనురెప్పలకు మస్కారా వాడితే మంచి లుక్‌ వస్తుంది.


స్టెప్‌ 9

లిప్‌స్టిక్‌ 

ముఖానికి అందం తెచ్చే వాటిలో లిప్‌స్టిక్‌ ఒకటి. మన మూడ్‌, వేసుకున్న బట్టలు, వెళ్తున్న ప్రదేశం, అక్కడున్న లైటింగ్‌ ఆధారంగా లిప్‌స్టిక్‌ను ఎంచుకోవాలి.

Updated Date - 2022-01-29T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising