ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీకు తెలుసా?

ABN, First Publish Date - 2022-08-10T05:34:10+05:30

ప్రపంచంలోనే అతి పెద్ద పక్షి ఆస్ర్టిచ్‌. తొమ్మిది అడుగుల ఎత్తు ఉండే ఈ పక్షి.. దాదాపు 150 కేజీల బరువు ఉంటుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రపంచంలోనే అతి పెద్ద పక్షి ఆస్ర్టిచ్‌. తొమ్మిది అడుగుల ఎత్తు ఉండే ఈ పక్షి.. దాదాపు 150 కేజీల బరువు ఉంటుంది. 

 అంత బరువును గురుత్వాకర్షణ శక్తి అధిగమించి కాళ్లు బ్యాలెన్సు చేయగలవు. 

డైనోసర్‌ కాళ్లలోని ఎముకల నిర్మాణమే ఈ పక్షి కాళ్లలో ఉంటుంది. ఒక్కసారి బలంగా తంతే సింహమే చచ్చిపోయేంత శక్తి వీటి కాళ్లకు ఉంటుంది. 

లైట్‌ బ్రౌన్‌ రంగులో ఆడపక్షులు ఉంటాయి. మగ పక్షులు నలుపు-తెలుపు రంగుతో ఆడపక్షులను ఆకర్షిస్తాయి.

ఆస్ర్టిచ్‌ గుడ్డు పరిమాణం ఆరు ఇంచులు, కేజీన్నర బరువు ఉంటుంది. దీని గుడ్డు 24 కోడి గుడ్లకు సమానం. ఒక గుడ్డును ఉడికించాలంటే గంట నుంచి 5 గంటల సమయం పడుతుంది. దాని పెంకు అంత గట్టిగా ఉంటుంది మరి! ఇక ఒక్కో పక్షి సంవత్సరానికి అరవై గుడ్లు పెడుతుంది. ఈ గుడ్లను 42 రోజుల నుంచి 46 రోజుల పాటు తల్లి పక్షి పొదుగుతుంది.

ఒక పిల్ల ఆర్నెళ్లనుంచి బాగా పెరుగుతుంది. సుమారు నాలుగేళ్ల వరకూ ఎత్తు, బరువు వేగంగా పెరుగుతుంది. ఇవి 50 ఏళ్ల నుంచి 75 ఏళ్ల వరకూ జీవిస్తాయి. 

ఏదైనా ప్రమాదం ఉందని గ్రహిస్తే.. గంటకు 70కి.మీ. వేగంతో ఈ పక్షి పరిగెత్తుతుంది.

నీళ్లు తాగకుండా కొన్ని రోజుల పాటు ఉండగలదు. దాని మెటబాలిక్‌ సిస్టమ్‌ అలా ఉంటుంది. దుంపలు, కీటకాలను తిని బతికే ఈ పక్షి నీళ్లు కనిపించగానే సంతోషపడి ఎక్కువ సమయం నీళ్లలోనే గడుపుతుంది.

ఆస్ర్టిచ్‌లు ఎడారి ప్రాంతాలతో పాటు పచ్చిక మైదానాల్లోనూ ఉంటాయి. ఆస్ర్టిచ్‌ మాంసం కోసం ఫామ్స్‌ నిర్వహిస్తారు కొన్ని దేశాల్లో. వీటి చర్మంతో లెదర్‌ వస్తువులు తయారీ చేస్తారు.

ఆస్ర్టిచ్‌లు కోళ్లలా పెంచుకోవచ్చు. మనిషితో ప్రేమగా ఉండగలదు. అయితే ఎప్పుడు దాడి చేస్తుందో ఊహించలేం. ఎందుకంటే వన్యప్రాణి కదా!

Updated Date - 2022-08-10T05:34:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising