ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంత పెద్ద కారో!

ABN, First Publish Date - 2022-04-05T05:30:00+05:30

ఈ కారును చూస్తే ఎవరైనా నోరెళ్ల బెట్టాల్సిందే! ఆధునిక హంగులు ఉన్న ఎలాంటి కారైనా ఈ కారు ముందు దిగదిడుపే! అందుకే గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల్లోనూ ఈ కారుకు చోటు దక్కింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కారును చూస్తే ఎవరైనా నోరెళ్ల బెట్టాల్సిందే! ఆధునిక హంగులు ఉన్న ఎలాంటి కారైనా ఈ కారు ముందు దిగదిడుపే! అందుకే గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల్లోనూ ఈ కారుకు చోటు దక్కింది. ఆ కారు విశేషాలు ఇవి....

ఒక కారులో  ఎంత మంది వెళతారు. పెద్ద కారైతే ఏడుగురు. కానీ ఈ కారులో ఒకేసారి 75 మంది ప్రయాణించొచ్చు. ఈ కారు పొడవు 100 అడుగులపైనే!

ఇక ఇందులో ఉన్న సౌకర్యాల లిస్ట్‌ చెబితే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఈ కారులో ఒక స్విమ్మింగ్‌పూల్‌, బాత్‌టబ్‌, మినీ గోల్ఫ్‌కోర్స్‌.... ఇలా బోలెడు సదుపాయాలున్నాయి. హెలికాప్టర్‌ ల్యాండ్‌ అయ్యేందుకు హెలీప్యాడ్‌ కూడా ఉంది.

అన్ని కార్లకు నాలుగు టైర్లుంటే ఈ కారుకు మాత్రం 26 టైర్లుంటాయి. ముందుభాగంలో ఒక ఇంజన్‌, వెనక భాగంలో ఒక ఇంజన్‌ ఉంటుంది. 

అమెరికన్‌ డ్రీమ్‌ అని పిలిచే కారు ప్రస్తుతం ఫ్లోరిడాలోని డెజర్‌ల్యాండ్‌ పార్క్‌ కార్‌ మ్యూజియంలో ఉంది. నిజానికి ఈ కారుని 1986లో తయారుచేశారు. అప్పుడే గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కింది. తాజాగా ఆ కారుకు కొన్ని మరమ్మతులు చేసి బయటకు తీశారు. దాంతో ఆ కారు మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. 

Updated Date - 2022-04-05T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising