ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగ్గురు స్నేహితులు

ABN, First Publish Date - 2022-09-18T09:59:30+05:30

Three friendsఒక అడవిలో రెండు కుందేళ్లున్నాయి. అవి క్లోజ్‌ ఫ్రెండ్స్‌. ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ వెళ్లేవాళ్లు. వీళ్లిద్దరికీ టింకూ అనే కుందేలు పరిచయమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క అడవిలో రెండు కుందేళ్లున్నాయి. అవి క్లోజ్‌ ఫ్రెండ్స్‌. ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ వెళ్లేవాళ్లు. వీళ్లిద్దరికీ టింకూ అనే కుందేలు పరిచయమైంది. కొన్నాళ్లకు ముగ్గురూ స్నేహితులయ్యారు. అల్లరి చేసేవాళ్లు. పొలాల్లోకి వెళ్లి క్యారెట్‌లు తినేవాళ్లు. ఆనందంగా సందడి చేసేవాళ్లు. వీళ్లను లిల్లీ అనే నక్క చూసింది. అడవిలో తిరుగుతూ, మంచి ఆహారం తినే ఈ కుందేళ్లు బాగా రుచిగా ఉంటాయని మనసులో అనుకుంది. కుందేళ్ల దగ్గరికెళ్లింది. అంతదూరంలోనే టింకూ కుందేలు.. ‘నక్క గారూ అక్కడే ఆగండి. దగ్గరగా వస్తే మేం పరిగెత్తుతాం’ అన్నది. ‘నేను మిమ్మలను ఏమీ అనను. శాకాహారం తిని బతుకుతున్నా. మాంసాహారం ముట్టలేదు చాలా ఏళ్లనుంచి’ అంటూ కహానీలు చెప్పింది. మిగతా రెండు కుందేళ్లు చెవులు రిక్కిరించి విన్నా.. టింకూ మాత్రం అసలు వినలేదు. నక్క బుద్ధి మంచిది కాదనుకుంది. తన స్నేహితులతో చెప్పింది.


కరోజు నక్క ఉదయాన్నే కుందేళ్ల ఇంటికి వచ్చింది. మీకో విషయం తెలుసా.. ‘మన అడవిలో ఓ ఎలుగుబంటి తిరుగుతోంది. దాని బారిన నుంచి తప్పించుకోవాలంటే కష్టం. నా ఉపాయం ముందు దాని తెలివి బలాదూర్‌’ అన్నది. ‘అవునా’ అన్నాయి కుందేళ్లు. మా ఇంటి దగ్గరకి వచ్చి మీరు ఉండొచ్చని కుందేళ్లకు సలహా ఇచ్చింది. టింకూ మిత్రులు వణికి పోయారు. అవసరం అనకుంటే మీ ఇంటికి వస్తామన్నది టింకూ. నక్క వెళ్లిపోయింది అక్కడ నుంచి. ‘చూడండి మిత్రులారా.. ఇదేదో ఉపాయం. నేను ఈ రోజు అక్కడికి వెళ్తా. మీరు నా వెనకాలే వచ్చి... ఇంటి బయట చూస్తుండండి’ అన్నది. ఎలుగుబంటి మనకు మిత్రుడు. దాని సాయం కోరదాం అన్నది టింకూ. ఎలుగుబంటికి విషయం చెప్పి ఎలుగుబంటితో సహా ముగ్గురు మిత్రులు వెళ్లారు. టింకూ నక్క ఇంటికి వెళ్లి భయపడినట్లు నటించింది. ‘భయపడకు.. నీకు ఇష్టమని క్యారెట్లు తెచ్చా’నంది. కుందేలు క్యారెట్‌ తింటుండగా..‘ఇక ఎక్కడికి వెళ్లలేవు. ఆ రెండు కుందేళ్లను ఇలానే పిలిచి తినేస్తా’ అన్నది. క్షణంలో ఎలుగు బంటి లోపలికి వచ్చింది. నక్క బిత్తరపోయింది. ఎలుగు వెనకాల రెండు కుందేళ్లున్నాయి. నక్క బిత్తరపోయింది. తప్పు మహాప్రభూ అంటూ వెనకాల నుంచి పరిగెత్తింది. ఇక అప్పటినుంచి నక్క అటువైపు రాలేదు. 

Updated Date - 2022-09-18T09:59:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising