ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

wells: బావులు మాయం!

ABN, First Publish Date - 2022-11-25T22:33:25+05:30

అనగనగా ఓ రాజ్యం. ఆ రాజ్యంలోని సభ. రాజుగారు వచ్చారు. ‘ఇది చలికాలం. రాబోయే ఎండాకాలం లోపల బావులు తవ్వించండి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కథ

అనగనగా ఓ రాజ్యం. ఆ రాజ్యంలోని సభ. రాజుగారు వచ్చారు. ‘ఇది చలికాలం. రాబోయే ఎండాకాలం లోపల బావులు తవ్వించండి. అన్ని చోట్లా నీరు ఉండాలి’ అంటూ మంత్రి గారిని ఆదేశించారు. మరుసటి రోజే రాజుగారి భాండాగారం నుంచి బంగారం, వెండినాణేలు ఇలా సంపద మంత్రిగారికి అందింది. మంత్రి వేగంగా బావులు తవ్వించాడు. ‘బావులు చూడాలి మహారాజా’ అంటూ రాజుగారికి సభలో చెప్పారు. రాజుగారు సకల సైనిక పటాలంతో రాజ్యంలోని పలు దిక్కులకు వెళ్లి చూశారు. ఎంతో పొంగి పోయాడు. ఆహా.. ఇక ప్రజలకు ఏమీ భయం ఉండదనే ఆనందంతో అదనంగా మంత్రికి మరింత ధనం ఇచ్చారు.

ఎండాకాలం రానే వచ్చింది. ఒక రోజు ఉదయాన్నే కొందరు గ్రామస్తులు రాజుగారిని కలవాలని కోటద్వారం దగ్గరకు వచ్చారు. లోపలికి వారిని పంపించలేదు. మరుసటి రోజు ఉదయం కూడా వచ్చారు. అక్కడ రాజుగారి ఆస్థానంలోని కవి కనిపించారు. ‘ఏమైంద’ని అడిగిగే.. ‘మా ఊరిలో బావి లేదు’ అంటూ వాపోయారు. అదేంటీ.. రాజ్యం అంతా బావులు తవ్వించారని రాజుగారు అంటున్నారన్నారు. ‘మహాప్రభో.. మేము చెప్పేది నిజం. గుక్కెడు నీళ్లు లేక విలవిలలాడుతున్నాం’ అని చెప్పారు. వెంటనే కవి గ్రామస్థులతో ఓ ఉపాయం చెప్పాడు. అదే మాటను రాజుగారితో చెబుతా అన్నారు. రాజు గారి దగ్గరకు పోయారు కవి. ‘మహారాజా.. మీరు తవ్వించిన బావులు దొంగలెత్తుకుపోయార’ని చెప్పారు. గ్రామస్తులు మీతో మాట్లాడాలనుకుంటున్నారనే విషయాన్ని చెప్పారు. గ్రామస్థులు లోపలికి వెళ్లి ‘రాజాగారు.. బావులు మాయమయ్యాయ’ని చెప్పారు. వారితో కలిసి గ్రామాలకు వెళ్లారు రాజుగారు. బావులు లేవక్కడ. దొంగలెత్తుకుపోలేదు.. అసలే బావులే కట్టలేదు మంత్రి అనే విషయం అర్థమైంది. వెంటనే ‘సొంత డబ్బులతో బావులు తవ్వించాల’ని ఆదేశం ఇచ్చారు రాజుగారు. చేసేదేమీ లేక మంత్రిగారు సొంత ధనంతో బావులను తవ్వించారు. కవిగారి ఉపాయానికి గ్రామస్థులే కాదు రాజు కూడా ఎంతో ఆనందించారు.

Updated Date - 2022-11-25T22:33:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising