ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ ఊరు తాళాలకు ప్రసిద్ధి!

ABN, First Publish Date - 2022-06-17T07:55:06+05:30

తమిళనాడులో చెన్నైకి 420 కి.మీ దూరంలో దిండిగల్‌ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో అడుగుపెడితే ఎక్కడ చూసినా తాళాల పరిశ్రమలు కనిపిస్తాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తమిళనాడులో చెన్నైకి 420 కి.మీ దూరంలో దిండిగల్‌ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో అడుగుపెడితే ఎక్కడ చూసినా తాళాల పరిశ్రమలు కనిపిస్తాయి. ఇంతకు ముందెప్పుడూ చూడని రకరకాల తాళాలు అక్కడ కనిపిస్తాయి.

ఈ గ్రామంలో తాళాల తయారీకి కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది. 18వ శతాబ్దంలో టిప్పు సుల్తాన్‌ కోరిక మేరకు ఆ గ్రామస్థులు  తాళాలు తయారుచేయడం మొదలుపెట్టారు. 

అప్పటినుంచి తాళాలు తయారుచేయడం వాళ్ల వృత్తిగా మారిపోయింది. ఇక వీళ్లు తయారుచేసే తాళాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తాళాల తయారీలో వీళ్ల నైపుణ్యాన్ని చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు.

తాళానికి తాళం చెవి పెట్టడానికి ఒక రంధ్రం ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్లు రెండు రంధ్రాలున్న తాళం తయారుచేస్తారు. అందులో ఒక రంధ్రంలో తాళం చెవి పెడితేనే తెరుచుకుంటుంది. పొరపాటున డమ్మీ రంధ్రంలో పెడితే తాళం జామ్‌ అవుతుంది. డూప్లికేట్‌ తాళం చెవి బయటక తీయడానికి సాధ్యం కాదు.

దొంగల బారి నుంచి కాపాడుకోవడానికి ఇలాంటి ట్రిక్‌లతో రకరకాల తాళాలు తయారుచేస్తుంటారు. మ్యాంగో లాక్స్‌, షటర్‌లాక్స్‌, బెల్‌లాక్స్‌, ట్రిక్‌ లాక్స్‌, బుల్లెట్‌ లాక్స్‌... ఇలా రకరకాల తాళాలు తయారుచేస్తారు. అంగుళం కన్నా చిన్నగా ఉండే తాళం కూడా వీళ్ల దగ్గర లభిస్తుంది. ఇక బుల్లెట్‌ లాక్‌ 15 కేజీల బరువు ఉంటుంది. 

Updated Date - 2022-06-17T07:55:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising