ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీకు తెలుసా?

ABN, First Publish Date - 2022-11-11T22:51:36+05:30

భూమ్మీద మొదట సూర్యోదయం జరిగేది న్యూజిలాండ్‌లోని నార్త్‌ ఐలండ్‌లో ఉండే గిబ్సన్‌ నగరంలో! ఈ దేశంలో పాములు ఉండవు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భూమ్మీద మొదట సూర్యోదయం జరిగేది న్యూజిలాండ్‌లోని నార్త్‌ ఐలండ్‌లో ఉండే గిబ్సన్‌ నగరంలో!

ఈ దేశంలో పాములు ఉండవు.

ప్రపంచంలోనే అవినీతి తక్కువగా ఉండే దేశంలో ఇది మొదటి మూడు స్థానాల్లో ఉంటుంది.

ప్రపంచంలోనే స్ర్తీలకు మొదట ఓటు హక్కు కల్పించిన దేశం ఇదే. 1893లో తొలిసారిగా అక్కడ మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ప్రపంచంలోనే అతి పొడవైన స్థలం పేరు ఇక్కడే ఉంది. దీని పేరు "Taumatawhakatangihangaoauauotameteaturipukakapikimaungahoronukupokaiwhenuakitanatahu ". ఈ పదంలో 85 అక్షరాలున్నాయి. అయితే దీన్ని Taumata hill అని పిలుస్తారు. కొండమీద ఉండే ఈ బోర్డు 350 మీటర్లు పొడవు ఉంటుంది.

ఇక్కడ ఉండే కీటకాలు ప్రపంచంలోనే అతి పెద్ద కీటకాలు. పక్షులూ అంతే. మోవా అనే పక్షి 3.6 మీటర్ల ఎత్తు, 260 కేజీల బరువు ఉంటుంది.

న్యూజిలాండ్‌ రోడ్ల మీద తిరుగుతున్నా, సముద్ర తీరాలకు వెళ్తున్నా ఖచ్చితంగా గొర్రెలు కనిపిస్తాయి. ఇక్కడ మనుషుల కంటే గొర్రెలు ఎక్కువ. 40 మిలియన్ల గొర్రెలున్నాయిక్కడ. న్యూజిలాండ్‌లోని ఒక్కో మనిషి 9 గొర్రెలను పంచుకోవచ్చు.

ప్రపంచంలోనే పర్యావరణ స్పృహ ఎక్కువగా ఉండే దేశాల్లో మూడో స్థానం న్యూజిలాండ్‌ది. ఈ దేశంలో 30 శాతం కొండలు, పచ్చికబయల్లు కనిపిస్తాయి.

ప్రపంచంలోనే అతి స్వచ్ఛమైన క్లియరెస్ట్‌ వాటర్‌ లేక్‌ ఇక్కడే ఉంది. దీని పేరు నెల్సన్‌ బ్లూ లేక్‌. 80 మీటర్ల లోతులో ఉండే వస్తువు కూడా కనిపిస్తుంది.

Updated Date - 2022-11-11T22:51:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising