ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిత్తులమారి పిల్లి!

ABN, First Publish Date - 2022-07-18T06:20:23+05:30

అనగనగా ఓ చిన్న అడవి. అడవిలో ఎక్కడ చూసిన చెట్లు కొట్టేసి ఉన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నగనగా ఓ చిన్న అడవి. అడవిలో ఎక్కడ చూసిన చెట్లు కొట్టేసి ఉన్నాయి. ఓ గుబురు చింతచెట్టు తొర్రలో ఓ పిచ్చుక ఉండేది. గడ్డిపోచలతో ఇల్లు అందంగా కట్టుకుంది. తన బంధువులను చూడటానికి ఒక రోజు వేరే ఊరికి వెళ్లింది. బంధువులతో సంతోషంగా గడిపి ఇంటికి వస్తూనే తన గూటిలో ఓ కుందేలు ఉంది. అది చూసి ఆ పిచ్చుక షాకైంది. ‘ఇది నా గూడు. వెంటనే ఇక్కడనుంచి వెళ్లిపో’ అన్నది. ‘ఆహా.. అలానా.. ఈ చెట్టు నీదా? దీనిమీద నీ పేరుందా? ఈ గూడు నువ్వు కట్టింది కాదు కదా. ఇదో చెట్టు తొర్ర. ఇది నాదే’ అంటూ గట్టిగా మాట్లాడింది. ‘నువ్వు వదిలి వెళ్లు ఈ గూటిని’ అంటూ ఒకరికొకరు తిట్టుకున్నారు. కొట్టుకున్నారు. ఇలా అయితే కుదరదని మూడో వ్యక్తిని అడిగి సమస్యను పరిష్కారం చేసుకోవాలని రెండూ బయలుదేరాయి. ఆ రోజు సాయంత్రం వరకూ మంచి తీర్పు చెప్పే వారి కోసం వెతికాయి. చివరకు అలసిపోయి. ఆ చెట్టుకు దగ్గరలో ఉండే పచ్చని బయలులో ఓ బలమైన గండు పిల్లి కూర్చొని ఉంది. ఎత్తు,బలం చూస్తే ఇది పిల్లి కాదు.. చిరుతేమో అన్నట్లుంది. అయితే అది ప్రశాంతమైన ధ్యానముద్రలో ఉంది. బహుశా పిల్లిగారు తెలివైన వారు. ఆధ్యాత్మికజీవిగా కనిపిస్తోంది కాబట్టి పరిష్కారం చెబుతుందని పిచ్చుక, కుందేలు ఆశపడ్డాయి. ఆ పిల్లి దగ్గరకు పోయి చెరో పక్కన కూర్చున్నాయి. ‘స్వామీ.. మీరు గొప్పవారిలా ఉన్నార’న్నారిద్దరూ. దొంగ ధ్యానం చేసే పిల్లి ‘మూర్ఖులారా మీకేమైంది?’ అని అడిగింది. పిచ్చుక, కుందేలు ఎవరి పాయింటా్‌ఫలో వాళ్లు కథను చెప్పారు. ‘ఓసినీ ఇంతేనా.. మీరిద్దరూ కాస్త దగ్గరగా వచ్చి ఇదే విషయాన్ని మళ్లీ చెరో చెవిలో చెప్పండి’ అన్నది ఆ పిల్లి. అట్లానే అంటూ దగ్గరగా వస్తూనే.. ఆ రెండింటిని గట్టిగా పట్టుకుని వాటి పీకలను కొరికేసింది. అంతటితో ఆ గూటికథ అంతమైంది. 

Updated Date - 2022-07-18T06:20:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising