ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్‌మచీ కోట!

ABN, First Publish Date - 2022-01-09T05:30:00+05:30

సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉందీ కోట. దీన్ని శాతవాహనులు నిర్మించినా, 1657లో శివాజీ పరిపాలనలోకి వచ్చాక బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. శివాజీ ఈ కోటను మరింతగా విస్తరించాడు. కోట ప్రాంగణంలో అనేక..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉందీ కోట. దీన్ని శాతవాహనులు నిర్మించినా, 1657లో శివాజీ పరిపాలనలోకి వచ్చాక బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. శివాజీ ఈ కోటను మరింతగా విస్తరించాడు. కోట ప్రాంగణంలో అనేక నిర్మాణాలు చేపట్టాడు. 1704లో మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు ఈ కోటను స్వాధీనం చేసుకున్నాడు. అయితే మరుసటి ఏడాదే మళ్లీ మరాఠాల చేతుల్లోకి వెళ్లింది. 18వ శతాబ్దంలో ముంబయి, పుణేల మధ్య వర్తకం బాగా జరిగేది. ఆ దారిలోనే ఈ  కోట ఉండటంతో వర్తకులు ఇక్కడ విశ్రాంతి కోసం ఆగేవారు. 19వ శతాబ్దంలో మరాఠాల చేతుల్లో నుంచి బ్రిటిష్‌ వాళ్ల చేతుల్లోకి వెళ్లింది. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తరువాత కోటను రక్షిత స్మారక చిహ్నంగా ప్రకటించారు. ఈ కోట శ్రీవర్దన్‌ హిల్‌, మనరంజన్‌ హిల్‌ అనే రెండు కొండల మధ్య నిర్మించారు. భారతీయ సంప్రదాయ పద్ధతిలో నిర్మించిన ఈ కోట పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తూ ఉంటుంది. ఇక్కడున్న కాలభైరవ ఆలయం, శివాలయం మహిమగలవిగా ప్రసిద్ధి.

Updated Date - 2022-01-09T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising