ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జయహో కుందేలు!

ABN, First Publish Date - 2022-08-06T05:54:52+05:30

ఒక అడవిలో కుందేలు, తాబేలు, జింక ఉండేవి. ఎంతో స్నేహంగా మెలిగేవి. గొడవల జోలికి వెళ్లేవి కావు. అడవిలో వారంపాటు వర్షం బాగా పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక అడవిలో కుందేలు, తాబేలు, జింక ఉండేవి. ఎంతో స్నేహంగా మెలిగేవి. గొడవల జోలికి వెళ్లేవి కావు. అడవిలో వారంపాటు వర్షం బాగా పడింది. దగ్గరలో దొరికే ఆకులు, దుంపలను ఆహారంగా తిని కాలం గడిపాయి. కొన్నాళ్ల తర్వాత అడవంతా ఎటు చూసినా పూలు. పచ్చని గడ్డి, పూలతో అందంగా ఉంది అడవి. జంతువులన్నీ ఆడుకుంటున్నాయి. అనుకోకుండా నా అంత వేగం ఎవరూ లేరంది జింక. నేనూ అంతే అన్నది కుందేలు. నేనేం తక్కువ తినలేదు.. అన్నది తాబేలు. తాబేలు మాటలు విని ఇద్దరూ గట్టిగా నవ్వారు. ‘అయితే పోటీ పెట్టండి. ఎవరు గెలుస్తారో చూద్దాం’ అన్నది తాబేలు. నక్క, కంచర గాడిద, ఎలుగుబంటి, ఇతర జింకలు, కుందేళ్ల సాక్షిగా ఒక రోజు పరుగు పందెం పెట్టుకున్నారు ముగ్గురు స్నేహితులు.


పోటీ ఆరంభమైంది. రెండు కిలోమీటర్లు పరిగెత్తాలి.. ఎవరు ముందొస్తే వారే విజేత. వారి మాట నెలపాటు వింటాం.. అన్నాయి మిగతా జంతువులు. జింక వేగంగా పరిగెత్తింది. మెల్లగా కాసేపు గడ్డి మేసింది. అయినా కుందేలు-తాబేలు కథ నాకు తెలీదా అనుకుంది. కుందేలు మాత్రం ఎక్కడా ఆగకుండా, నిద్రపోకుండా పరుగెత్తింది. జింకమాత్రం కొద్ది సేపు విశ్రాంతి తీసుకోవాలనుకుంది. అయినా నేను పరిగెత్తితే పులి కూడా పట్టుకోలేదని అనుకుంది. కొద్ది సమయం తర్వాత చూస్తే కుందేలు విజయానికి దగ్గరవుతోందని గ్రహించింది జింక. పెద్ద పెద్ద అంగలేసుకుంటూ పరిగెత్తింది. ఫలితం శూన్యం ఆ పాటికే కుందేలు విజేత అయింది. తాబేలు కంటే వెనకల పడితే పరువుపోతుందని జింక వేగంగా పరిగెత్తి రెండో స్థానంలో నిలిచింది. చాలా సమయం తర్వాత తాబేలు అక్కడకు వెళ్లింది. ‘కుందేలుకు గెలపు ఎలా సాధ్యమైంది’ అని అన్ని జంతువులూ అడిగాయి. ‘నాకు చిన్నప్పటినుంచి చిన్నగా నడవటం కంటే వేగంగా పని పూర్తి చేయటం ఇష్టం. మధ్యలో ఎలాంటి ఆహారం దొరికినా పట్టించుకోను అందుకే ఈ విజయం’ అన్నది. అందరూ ‘జయహో.. కుందేలు’ అన్నారు బిగ్గరగా!

Updated Date - 2022-08-06T05:54:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising