ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒంటి కన్ను పిచ్చుక!

ABN, First Publish Date - 2022-08-20T05:59:50+05:30

అనగనగా ఒక అడవిలో ఒక పిచ్చుక ఉండేది. దానికి ఒంటి కన్ను ఉండేది. ‘ఒంటి కన్ను పిచ్చుక’ అంటూ మిగతా పక్షులు తూలనాడేవి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనగనగా ఒక అడవిలో ఒక పిచ్చుక ఉండేది. దానికి ఒంటి కన్ను ఉండేది. ‘ఒంటి కన్ను పిచ్చుక’ అంటూ మిగతా పక్షులు తూలనాడేవి. అయితే ఆ పిచ్చుక ఏనాడూ బాధపడలేదు. దానికి ఒక పిల్లి కూన స్నేహితుడు. ‘లోకులు అలానే మాట్లాడతారు. మనం మన పని చేసుకుంటూ పోవాలి’ అంటూ పిచ్చుకకు పిల్లి మంచి మాటలు చెప్పేది. ఒకరోజు అనుకోకుండా పిల్లులను పట్టే వాళ్లు కొందరు అడవిలో తిరుగుతున్నారనే విషయం తెలిసి.. పిల్లికూన భయంతో గజగజ వణుకుతోంది. ‘దయచేసి నన్ను రక్షించండి’ అంటూ అందరి ఇళ్లకు వెళ్తోంది. ఎవరూ పట్టించుకోలేదు. పైగా మీ ఒంటి కన్ను పిచ్చుక ఉంది కదా.. అంటూ హాస్యంగా మాట్లాడారు. పిల్లి కూనకు కోపం వచ్చింది. ఇంటికి వచ్చింది. 


పిచ్చుక, పిల్లికూన చెట్టుదగ్గర కూర్చొని ఆలోచిస్తున్నాయి. నేను పైకి ఎగిరి ఒక సురక్షిత ప్రాంతం చూస్తాను. అక్కడికి నిన్ను తీసుకొని పోతా అన్నది. దారిని వెతుకుతూ పిచ్చుక వెళ్తూంటే ఆహారం కనపడి కింద వాలిందో లేదో వలలో చిక్కుకుపోయింది. వేటగాడు వస్తాడేమోనని భయపడుతుంటూ.. చెట్టుకింద బొరియలోంచి ఓ చుంచు ఎలుక వచ్చింది. ‘దేవుడిలా వచ్చారు ఎలుకగారు. మీ జాతికి ఏమీ కాకుండా సాయం చేస్తా’ అన్నది. ఎలుక నవ్వింది. నీ వల్ల నాకు ఏమి ఉపయోగముందీ? అన్నది. ‘నన్ను రక్షించు. నీకు సాయం తప్పక చేస్తా’నన్నది. ఒంటి కన్ను పిచ్చుకను చూసి జాలిపడి వేగంగా వలను కొరికేసింది ఎలుక. ఆ ఎలుకలు ఉండే బొరియలో పిల్లికూన ఉంటే ఏమీ కాదని పిచ్చుక అనుకుంది. అనుకుందే తడవుగా పిల్లికూనను తీసుకొచ్చింది.


బొరియలోని ఎలుకలన్నీ దాక్కున్నాయి. నేనేమీ చంపను.. అంటూ ఎలుకల పెద్ద బొరియల్లోకి వెళ్లి పిల్లి దాక్కుంది. అక్కడకి పిల్లులు పట్టేవాళ్లు వచ్చినా.. పిల్లిని కనుక్కోలేకపోయారు. దీంతో పిల్లి, ఎలుకలు, పిచ్చుక మంచి స్నేహితులయ్యారు. జాతి వైరం లేకుండా కలసి మెలసి ఉన్నారు. పిల్లికూన పెరిగి పెద్దయింది. ఇతర పిల్లులు, పక్షులనుంచి కాపాడే బాధ్యత పిల్లి తీసుకుంది. ఒంటి కన్ను పిచ్చుక ఇతరుల మాటలను పట్టించుకోకుండా హాయిగా జీవితం గడపటం ప్రారంభించింది. 

Updated Date - 2022-08-20T05:59:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising