ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Good Manners : పిల్లలకు ఈ మర్యాదలు నేర్పడం అవసరం.

ABN, First Publish Date - 2022-09-19T20:32:50+05:30

పిల్లలు పెరుగుతున్నారు. పెద్దవాళ్ళవుతున్నారు అంటే వాళ్ళకు పెద్దలనుంచి కొన్ని అలవాట్లు వచ్చే ఉంటాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మర్యద, మన్నన పెద్దల పట్ల గౌరవం కలిగిన పిల్లల్ని చూసినపుడు చాలా ముచ్చట పడతాం. వాళ్ళకు అన్ని సుగుణాలు అబ్బినందుకు పిల్లల తల్లిదండ్రులను పొగిడేస్తాం. ఇంత చక్కగా పెంచిన పెద్దవాళ్ళకు అభినందనలు తెలియజేస్తాం. పిల్లలు పెరుగుతున్నారు. పెద్దవాళ్ళవుతున్నారు అంటే వాళ్ళకు పెద్దలనుంచి కొన్ని అలవాట్లు వచ్చే ఉంటాయి. అవి చక్కగా తీర్చిదిద్దేవే అయితే ఇంకా ముచ్చటగా ఉంటుంది. మరి పిల్లల్లో అలవాటు కావలసిన మర్యాదలేంటో చూడండి.


1. ఏదైనా సాయం పొందితే వెంటనే 'ధన్యవాదాలు' తెలియజేసే అలవాటు కావాలి.

2. ఏదైనా వస్తువును తీసుకునే ముందు అనుమతి తీసుకునే అలవాటు

3. పని ప్రారంభించే ముందు ఇతరులకు ప్రాముఖ్యత ఇవ్వాలి.

4. ఎదుటివారు విషయాన్ని చెప్పదలచుకోకపోతే వారి గోప్యతను గౌరవించాలి

5. తుమ్ములు, దగ్గు, ఆవలించే సమయంలో నోరు కప్పుకోవడం అలవాటు చేయాలి

6. వ్యక్తుల పట్ల ఉదారంగా ఉండటం

7. మనసులోని భావాలను పంచుకునే అలవాటు

8. బాధ్యతగల మనిషిగా ఉండటం నేర్పాలి.

9. హ్యాండ్‌షేక్, ఐ కాంటాక్ట్, పదాల ప్రాముఖ్యం తెలియజెప్పాలి.

10. సేవ చేసే వ్యక్తులతో మర్యాదగా ప్రవర్తించడం తెలియాలి.

11. ‘నన్ను క్షమించు’ , ‘క్షమించండి’ ఉపయోగం తెలుసుకోవాలి.

12. ఇతరులను ఎగతాళి చేయవద్దు.

13. పెద్దలకు గౌరవం ఇవ్వండి.


పిల్లలకు స్నేహితులు, కుటుంబం, ఉపాధ్యాయులతో మామూలు మాటల్లో కూడా కృతజ్ఞతలను, ప్రశంసలను ఉపయోగించడం తెలియాలి. అందుకే ఈ విషయాలను పిల్లలకు నేర్పడం తల్లిదండ్రుల ప్రధాన కర్తవ్యం. 

Updated Date - 2022-09-19T20:32:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising