ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Parenting Tips: మీ పిల్లలు రాత్రిపూట చెవి నొప్పితో ఏడుస్తున్నారా? ఇలా చేయండి.

ABN, First Publish Date - 2022-09-02T22:02:52+05:30

మాటలు రాని పనితనం, పైగా ఏ బాధనూ చెప్పలేనితనం వల్ల వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు అనేది సరిగ్గా తెలీదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొన్నిసార్లు పిల్లలు చెవిలో తీవ్రమైన నొప్పికి రాత్రిపూట బాగా ఏడుస్తారు. ఈ చెవి నొప్పి నివారించడానికి కొన్ని రెమెడీస్‌తో ఉపశమనాన్ని పొందవచ్చు అవేంటో చూద్దాం.  


పిల్లలలో చెవి నొప్పి: చాలా సార్లు పిల్లలు రాత్రిపూట చాలా బిగ్గరగా ఏడవడం మొదలు పెడతారు. మాటలు రాని పనితనం, పైగా ఏ బాధనూ చెప్పలేనితనం వల్ల వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు అనేది సరిగ్గా తెలీదు తల్లితండ్రులకు. సమస్యకు కారణమేమిటో అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. 


అయితే పిల్లల్లో జలుబు - జలుబు ఉన్నప్పుడు, చెవిలో నొప్పి ఉంటుంది. ఇది కాకుండా, కొన్నిసార్లు తేమ కారణంగా, చెవిలో ఇన్ఫెక్షన్ ఉంటుంది. అలాగే చెవిలో వ్యాక్స్ కూడా నొప్పిని కలిగిస్తుంది. దీనితో రాత్రి చెవిలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. చెవి నొప్పి ఏవయసు వారికైనా తీవ్రమైన బాధే..మరి రాత్రిపూట చెవినొప్పితో బాధపడే పిల్లలకు ఉపశమనాన్ని ఏలా ఇవ్వచ్చు. తెలుసుకుందాం.


చెవి నొప్పికి ఇంటి నివారణలు చూద్దాం.


1. పిల్లల చెవిలో నొప్పి ఉన్నప్పుడు, ఐస్ ముక్కతో కాస్త ఉపశమనం కలుగుతుంది. చెవి నొప్పి కారణంగా పిల్లలకు భరించలేని నొప్పి ఉంటుంది. దీని నుంచి ఉపశమనం పొందడానికి ఐస్ ముక్కను పెట్టండి. ఇది నొప్పిని తగ్గిస్తుంది. కాటన్ క్లాత్‌లో ఐస్ ముక్కను తీసుకొని చెవి వెనుక లేదా నొప్పి ఉన్న ప్రదేశంలో పెట్టాలి. ఇది త్వరగా ఉపశమనం ఇస్తుంది.


2. తులసి రసం- ఇది చాలా ప్రభావవంతమైన వంటకం. పిల్లలకు చెవిలో నొప్పి వచ్చినప్పుడల్లా తులసి ఆకుల రసాన్ని తీసి 1-2 చుక్కలు చెవిలో వేయండి. ఇది నొప్పిని ఆపివేస్తుంది. పిల్లలు రాత్రిపూట సులభంగా నిద్రపోతారు.


3. ఆలివ్ ఆయిల్- చెవినొప్పిలో ఆలివ్ ఆయిల్ కూడా మేలు చేస్తుంది. కొద్దిగా ఆలివ్ నూనెను వేడి చేసి, దూదితో చెవిలో 1-2 చుక్కల నూనె వేయండి. ఇలా చేస్తే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.


పై విధంగా చేయడం వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది.

Updated Date - 2022-09-02T22:02:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising