ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీకు తెలుసా?

ABN, First Publish Date - 2022-09-28T05:55:17+05:30

గిలా వడ్రంగి పిట్టలు పశ్చిమ అమెరికా రాష్ర్టాలు, మెక్సికో మధ్యభాగంలోని ఎడారి ప్రాంతాల్లో ఇవి నివసిస్తాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గిలా వడ్రంగి పిట్టలు పశ్చిమ అమెరికా రాష్ర్టాలు, మెక్సికో మధ్యభాగంలోని ఎడారి ప్రాంతాల్లో ఇవి నివసిస్తాయి.

వీటి పొడవు 24 సెం.మీ. బరువు 51 గ్రాములు నుంచి 79 గ్రాముల మధ్యలో ఉంటాయి. వింగ్‌ స్పాన్‌ 40 సెం.మీ.

ఇవి గ్రేయిస్‌ బ్రౌన్‌ రంగుల్లో ఉంటాయి. మగ పక్షులకు తల దగ్గర ఎర్రగా బొట్టుపెట్టినట్లు ఉంటుంది. 

అతి ఎత్తయిన కాక్టేసి చెట్లతో పాటు ఎత్తయిన పండ్ల చెట్లు, వట్టిపోయిన పెద్ద చెట్లను అంటిపెట్టుకుని ఉంటాయి. ప్రాణమున్న పండ్ల చెట్లకు ఏమాత్రం హానికరం కాకుండా గూళ్లు నిర్మించుకుంటాయి. ఆడ, మగ పక్షులు వాటి ముక్కుతో రంధ్రాలు చేసి గూళ్లు కట్టుకోవడంలో ఎక్స్‌పర్ట్‌.

ఇవి వదిలేసిన గూళ్లను గుడ్లగూబలు, గూళ్లు కట్టుకోలేని ఇతర పక్షులు ఆక్రమించుకుంటాయి.

గిలా వడ్రంగి పిట్ట ‘చుర్‌’ అనే శబ్దంతో అరుస్తాయి. డ్రమ్‌ కొట్టినట్లు స్టడీగా గట్టిగా సౌండ్‌ చేస్తాయి. 

కోడిపిల్లలు, పండ్లు, కీటకాలు, గుడ్లు, చిన్న పక్షులను తింటాయి.

మూడు లేదా నాలుగు గుడ్లు పెడతాయి. పది లేదా పన్నెండు రోజులు పొదుగుతాయి. మగపక్షి కూడా గుడ్ల మీద కూర్చుంటుంది. నాలుగు వారాల పాటు చిన్నపిల్లను బాగా చూసుకుంటాయి. ఆహారాన్ని తినిపిస్తాయి.

వాతావరణంలోని మార్పులు, ముఖ్యంగా ఎడారి ప్రాంతం కావటం వల్ల వీటి సంతతి అభివృద్ధి కావటం లేదు. చాలా తక్కువ పక్షులుంటాయి. 

Updated Date - 2022-09-28T05:55:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising