ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాకి - కొంగ!

ABN, First Publish Date - 2022-09-15T09:35:55+05:30

ఒక చెరువు దగ్గర ఉండే చెట్టు మీద కాకి వాలింది. పొద్దుపోక ముక్కుతో జామ ఆకుల్ని తెంపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క చెరువు దగ్గర ఉండే చెట్టు మీద కాకి వాలింది. పొద్దుపోక ముక్కుతో జామ ఆకుల్ని తెంపుతోంది. అంతలో చెరువు గట్టు దగ్గర ఒక కొంగ వాలింది. కొంగను చూస్తోంది కాకి. క్షణాల్లో కొంగ రివ్వున గాల్లోకి లేచి.. చూపను పట్టుకుంది తన కాలి గోళ్లతో. కాకి ఉండే చెట్టు మీదకొచ్చి కొంగ వాలింది. చేపను తింటోంది. ‘రుచిగా ఉందో చేప’ అంటూ కాకి వైపు చూస్తూ అంటోంది. కాకికి నోరూరింది. అడగాలనుకున్నా మొహమాటం అడ్డొచ్చింది. ‘నేను రెండు చేపలను ఒకేసారి పడతా’ అన్నది కాకి. ‘ఈ చెరువులో చేపలన్నీ రుచిగా ఉన్నాయి. నువ్వు రెండు చేపలు పట్టగలవు. ఆ నేర్పు నీలో ఉంది’ అని వెటకారంగా మాట్లాడింది కొంగ. ‘నా ప్రతిభ చూడు’ అంటూ గాల్లోకి ఎగిరింది. కాకి చెరువు మీద గాల్లో పల్టీలు కొట్టాలని ప్రయత్నించింది. పట్టు తప్పి కింద పడబోయింది. ఎదురుగా చూస్తే నీళ్లలో నోరు తెరచుకుని ముసలి ఉంది. ఇక చచ్చానురోయ్‌ అనుకుంది కాకి. ఇక చేసేదేమీ లేక దేవునిపై భారం వేసింది. ఇంతలో నీటి మీద ఒక మునగ మొద్దు మొసలి నోటికి తగిలింది. కాకి పక్కన పడబోయి శక్తిని కూడదీసుకుని గాల్లోకి ఎగిరింది. ‘హమ్మయ్య ప్రాణాలు దక్కాయి’ అనుకుంటూ చెట్టు మీదకి వచ్చి వాలింది. ఇదంతా కొంగ చూస్తోంది. ‘చెరువు మీద చక్కర్లు కొట్టడం నా చేత కాదు. పావురాల్లా గాల్లో ఎగరటం పెద్ద పక్షులకు కుదరదు. ఎంత సేపున్నా గట్టున ఉండి. చేపలు పట్టుకునే నేర్పు తెలుసుకోవాలి. దీనికి శిక్షణ, తెలివి అవసరం’ అన్నది కొంగ. సిగ్గుతో కాకి తలవంచుకుంది. ‘కొంగ గారూ.. పొరబాటున బుద్ధిలేక.. చేప రుచిని చూడాలని అలా చేశా. నా పొగరు ఇది. మీరు చేపలు పట్టుకోవడంలో సిద్ధమస్తులు. నేను కాదు’ అని తెలుసుకున్నానంది. ‘ఇవన్నీ మామూలే. మనం ఏ పని చేయవచ్చనేది తెలుసుకోవడమే ముఖ్యం’ అన్నది కొంగ. ఆ రోజు నుంచి కాకి, కొంగ స్నేహితులయ్యారు.

Updated Date - 2022-09-15T09:35:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising