ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

cloud: జాలి మేఘం!

ABN, First Publish Date - 2022-11-04T05:35:48+05:30

భూమి మీద ఎండ ప్రతాపం చూపుతోంది. వానొస్తే చాలని అందరూ అనుకుంటున్నారు. చెట్లు, చేమల బాధ కూడా అదే రీతిలో ఉంది. కింద ఉండే పరిస్థితిని చూసి మేఘం జాలి పడింది. అయ్యో.. వాన కురిపించాలి అనుకున్నది. దారిలో వెళ్లే గాలిని అడిగిందిలా.. ‘అన్నా.. పాపం. వానల్లేక జనాలు అలమటిస్తున్నారు.

cloud
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భూమి మీద ఎండ ప్రతాపం చూపుతోంది. వానొస్తే చాలని అందరూ అనుకుంటున్నారు. చెట్లు, చేమల బాధ కూడా అదే రీతిలో ఉంది. కింద ఉండే పరిస్థితిని చూసి మేఘం జాలి పడింది. అయ్యో.. వాన కురిపించాలి అనుకున్నది. దారిలో వెళ్లే గాలిని అడిగిందిలా.. ‘అన్నా.. పాపం. వానల్లేక జనాలు అలమటిస్తున్నారు. నువ్వు నా దగ్గరికి గట్టిగా వస్తే వీళ్లనంతా సంతోషంతో కూడా ముంచెత్తుతా అన్నది. ‘అయ్యో.. పిచ్చి.. మేఘమా. అమాయక మిత్రుడా! దయచేసి ఈ జనాలను నమ్మకు. ఎలాగైనా ప్రవర్తిస్తారు. అసలు వీళ్లు చెట్లు కొట్టడం వల్ల ఆక్సిజన్‌ లెవల్‌ తగ్గిపోతోంది. పైగా సూర్యకిరణాలు నేరుగా భూమిమీద పడుతున్నాయి. ఓజోన్‌ పొర దెబ్బతింటోంది అంటూ మండిపడింది. క్షణాల్లో మేఘం కోప్పడింది. దూరంగా వెళ్లిపోయింది.

మేఘం దూరంగా వెళ్తూనే ఉంది. తనకింద భూమి మీద ఉండే జనాలంతా వర్షం పడితే చాలని ప్రార్థిస్తున్నారు. అన్నీ అర్థమైనా కోపంతో దూరంగా వెళ్తోంది. చివరికి ఓ పర్వతం దగ్గరకు వెళ్తోంది. మేఘాన్ని చూసి పర్వతం ఇలా అన్నది. ‘మేఘమా.. దయచేసి నీవు విశ్రాంతి తీసుకో. చాలా దూరం ప్రయాణించావు’ అన్నది. సరేనంది మేఘం. ఇంతలోనే పర్వతం మీద ఉండే చిన్న చిన్న మేఘాలొచ్చాయి. ఈ మేఘంతో కలిసి పోయాయి. నల్లగా మబ్బు కమ్ముకుంది. అక్కడ ఉండే జనాలంతా ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే మేఘాలు ఢీకొట్టి ఉరుములు, మెరుపులు వచ్చాయి. ఆహ్లాదంగా మారింది వాతావరణం. ప్రజలంతా ఎదురుచూస్తుంటే.. మేఘాలన్నీ వర్షాన్ని కురిపించాయి. అన్నీ మాట్లాడుకున్నాయి. జాలి మేఘం ఇలా అన్నది.. ‘పాపం.. ఈ మనుషులు చూడు ఎంత సంతోషపడుతున్నారో.. ఇంత చిన్న విషయానికి. ఆ చెట్లు, చేమలు, జంతువులు తలూపినట్లు ఉన్నాయనుకుంది. వాన పడుతోంటే కింద జనాలు సంతోషం.. మేఘానికి ఆనందం. తనలోని వర్షం భూమిమీద కురిపించిన మేఘం మనసు తేలికైంది. హాయిగా నిద్రపోయింది.

Updated Date - 2022-11-04T05:56:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising