ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిల్లి- ఎలుక

ABN, First Publish Date - 2022-09-27T06:33:36+05:30

పిల్లి, ఎలుక ఒక చెట్టు కింద ఉండేవి. వాస్తవానికి అవి బద్ధ శతృవులు. జన్మజన్మల నుంచి వాటికి వైరం ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిల్లి, ఎలుక ఒక చెట్టు కింద ఉండేవి. వాస్తవానికి అవి బద్ధ శతృవులు. జన్మజన్మల నుంచి వాటికి వైరం ఉంది. అయితే ఈ పిల్లి, ఎలుక మాత్రం మంచి స్నేహితులు. స్టీరియోటైప్‌ ఆలోచనలను బ్రేక్‌ చేసిన సాహసిలు. ఈ పిల్లి, ఎలుక అడవికి వెళ్లటం.. ఆనందంగా ఉండటం ఎవరికీ నచ్చలేదు. అదేంటీ.. వీళ్లు కొట్లాడుకోకుండా ఇలా ఉన్నారు. వీళ్ల మధ్య ఏదోటి చిచ్చు పెట్టనిదే కుదరదనుకున్నాయి కొన్ని జంతువులు. అయితే ఆ పని నక్క చేయటానికి రెడీ అయింది. ఒక రోజు ఉదయాన్నే పిల్లి ఇంటికి వెళ్లి తలుపు కొట్టింది నక్క. ‘ఏంటో నక్కబావ గారు ఇలా దయచేశారు’ అన్నది పిల్లి. అంత వెటకారం ఎందుకులే అన్నది నక్క. ‘వచ్చిన పని ఏంటీ’ అనడిగింది పిల్లి. ‘ఏమీ లేదు. ఎలుకల గుంపు దగ్గరకు వెళ్లాను. ఈ మధ్య పిల్లి జాతికి నెత్తురు లేనట్లుంది. తన గుణాన్ని కోల్పోయిన ఓ పిల్లి మా ఎలుకకు స్వయాన ఫ్రెండే’ అన్నాయి. వినుకో పిల్లి.. ఆ మాటలు వింటే నాకే బాధ అనిపించింది. కన్నీళ్లొచ్చాయి’ అన్నది నక్క. పిల్లి సీరియ్‌సగా నువ్వు వెళ్లిపో ఇంటికి అన్నది.


తలుపు వేసుకుంది. నవ్వుతూ నక్క ఇంటికి వెళ్లిపోయింది. ఆ వెంటనే ఎలుక దగ్గరకు పోయింది నక్క. ఎలుక చూసి దూరంగా వెళ్తోంటే.. ‘ఆగు ఆగు ఎలుకమ్మ. ఏదైనా ఆహారం లేనప్పుడు నిన్ను తింటాన’నని పిల్లి అంటోందట. ఈ విషయం నా మిత్రుడైన కోతికి చెప్పిందట ఆ పిల్లి అన్నది. ఎలుక బొరియలోకి వెళ్లిపోయింది. నక్క నవ్వుతూ వెనక్కి చూడకుండా వెళ్లిపోయింది. ఆ తర్వాత  రోజు పిల్లి, ఎలుక కలవలేదు. నక్క ఏమో ఇవి రెండూ కొట్లాడుకుంటాయని ఎదురుచూడసాగింది. పిల్లి, ఎలుక మరుసటి రోజు కలిశాయి. నక్క చాడీలను వల్లెవేస్తూ గట్టిగా నవ్వుకున్నాయి. అలానే వారి స్నేహం కొనసాగుతోంటే నక్క కడుపు భగ్గుమంది. ఇలా ఎవరైనా చాడీలు చెబుతారని.. ఆ పిల్లి, ఎలుక పరిచయం అయిన తొలిరేజే మాట్లాడుకున్నాయి. అందుకే అవి చెప్పుడు మాటలు విని.. షేర్‌ చేసుకుని నవ్వుకుంటాయంతే. 

Updated Date - 2022-09-27T06:33:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising