ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బుజ్జి జిరాఫీ... సీటూనీ కథ

ABN, First Publish Date - 2022-08-11T05:30:00+05:30

అమెరికాలోని శాండియాగో జూ సఫారీ పార్క్‌లో గత ఫిబ్రవరి 1 నాడు ఒక బుజ్జి జిరాఫీ పుట్టింది. దాని పేరు సీటూనీ.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెరికాలోని శాండియాగో జూ సఫారీ పార్క్‌లో గత ఫిబ్రవరి 1 నాడు ఒక బుజ్జి జిరాఫీ పుట్టింది. దాని పేరు సీటూనీ. ఆ పేరుకు స్వాహిలీ భాషలో ‘అడవిలో’ అని అర్థం. అయితే సీటూనీ వంకర కాళ్లతో పుట్టింది. దాని ముందరి కాలి కీళ్లలో లోపం ఉండడంతో అది లేచి నిలబడలేకపోతోంది, నడవలేకపోతోంది. ఆ పరిస్థితిలో అది తల్లి జిరాఫీ పాలు తాగే వీలు లేదు కాబట్టి సీటూనీ ఎక్కువ కాలం బ్రతకదని జూ సిబ్బంది భావించారు. ఐదు అడుగుల 10 అంగుళాల ఎత్తు, 55 కిలోల బరువు ఉన్న సీటూనీ, లేచి నిలబడే ప్రయత్నం చేసిన ప్రతిసారీ, దాని కీళ్లపై ఒత్తిడి పెరిగిపోతూ ఉంది. 


పలు రకాల బ్రేసెస్‌

పశువైద్యుడైన మ్యాట్‌ కిన్నే సీటూనీ కాళ్లకు ఆసరా దక్కాలంటే, దాని కాళ్లకు బ్రేసెస్‌ బిగించాలని అర్థం చేసుకున్నాడు. మొదట స్థానిక స్టోర్‌ నుంచి సపోర్ట్స్‌ తీసుకొచ్చి బిగిస్తే, అవి జారిపోయాయి. దాంతో మనుషుల కోసం తయారైన బ్రేసె్‌సకు కొన్ని మార్పులు చేసి బుజ్జి జిరాఫీకి బిగించాడు. కానీ అవి కూడా ఎక్కువ కాలం ఉపయోగపడలేదు. దాంతో జూ సిబ్బంది పారా ఒలంపియన్లకు కృత్రిమ అవయవాలను తయారుచేసే హ్యాంగర్‌ క్లినిక్‌ను సంప్రతించింది. 2006లో ఈ క్లినిక్‌, డాల్ఫిన్‌కు కృత్రిమ తోకను తయారు చేసి అందించింది. అయితే జిరాఫీకి కృత్రిమ అవయవాలను తయారుచేసిన పూర్వ అనుభవం లేకపోయినా, సీటూనీ కాళ్ల కొలతలు సేకరించి, మోడళ్లను తయారుచేయడానికి పూనుకుంది. ఇందుకోసం గుర్రాల బ్రేసెస్‌ తయారీలో ఉపయోగించే, దృఢమైన కార్బన్‌ గ్రాఫైట్‌ అనే మెటీరియల్‌ను ఉపయోగించి, సీటూనీకి కృత్రిమ కాళ్లను రూపొందించింది. 


బ్రేసెస్‌ను వదిలించుకుని...

ఆ బ్రేసె్‌సను బిగించిన తర్వాత సీటూనీ, సాధారణ పిల్ల జిరాఫీల్లాగే చక్కగా ఎదిగింది. అలా 39 రోజుల పాటు బ్రేసె్‌సను ధరించిన తర్వాత, సీటూనీ వాటి సహాయం లేకుండా స్వయంగా నడవడానికి అలవాటు పడింది. అలా అన్ని రోజుల పాటు జూ హాస్పిటల్‌కే పరిమితమై, పూర్తిగా కోలుకున్న సీటూనీని, అంతిమంగా జూలోని మిగతా జిరాఫీలతో కలిపేశారు. ఇప్పుడీ బుజ్జి సీటూనీ సాటి జిరాఫీల్లాగే హుషారుగా గెంతుతూ, ఆరోగ్యంగా తిరుగుతూ ఉండడం విశేషం!

Updated Date - 2022-08-11T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising