ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గండుచీమ.. పావురం!

ABN, First Publish Date - 2022-07-21T06:14:29+05:30

ఉదయాన్నే బీభత్సమైన వాన. అందునా గాలివాన. చెట్ల కొమ్మలు ఇరిగిపడుతున్నాయి. ఎక్కడ చూసినా నీళ్లు పారుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దయాన్నే బీభత్సమైన వాన. అందునా గాలివాన. చెట్ల కొమ్మలు ఇరిగిపడుతున్నాయి. ఎక్కడ చూసినా నీళ్లు పారుతున్నాయి. గుబురు వేపచెట్టులోకి ఒక డేగ వచ్చి ఆ కొమ్మల మీద కూర్చున్న పావురాన్ని తరిమి కొట్టింది. ఆ పావురం గజగజ వణుకుతూ వేరే చెట్టును వెతుక్కోవాలని బయలుదేరింది. కాలువలో ఓ గండుచీమ కొట్టుకు వస్తుంటే.. పావురం చూసింది. ‘కాపాడండి..’ అని అరుస్తోంది చీమ. చీమను చూసి అయ్యో అనుకుంది పావురం. గజగజ వణుకుతూనే.. ఓ కానుగాకును తన ముక్కుతో చీమ దగ్గర వదిలేసింది. ఆకుపైకి చీమరాగనే.. ఆకును ముక్కున కరుచుకుని రివ్వున గాల్లోకి ఎగిరి.. ఓ చెట్టు కొమ్మపై కూర్చుంది పావురం. చీమ ఆనందానికి అవధుల్లేవు. ‘నీ రుణం తీర్చుకుంటా.. మిత్రమా. నా సాయం కావాలంటే చెప్పు’ అని చీమ అడుగుతూనే.. లోపల నవ్వుకుంది పావురం. సరేలే అన్నట్లు తలూపింది.


కరోజు ఓ డేగ.. పావురాన్ని వేటాడింది. గాల్లో పల్టీలు కొడుతూ పావురం తప్పించుకోవాలనుకుంది. ఈ లోపల ఇంకో డేగ వచ్చి తన కాళ్లతో పావురం తలపై తన్నింది. పావురం కళ్లుదిరిగి కిందపడిపోయింది. వెంటనే కిందికి దిగి.. పావురం రెక్కపై పొడిచింది. రెక్కలోంచి రక్తం కారింది. పావురం కళ్లు మసకబారాయి. ఇంకో డేగ కూడా పావురం ముందు వాలింది. ‘ఇక ఇదే చివరి క్షణం’ అనుకుంది పావురం. కొద్దిసేపటి తర్వాత కళ్లు తెరిచింది. తన ముందు ఆహారం ఉంది. ఎదురుగా గండు చీమలదండు. అందులోంచి ఓ గండుచీమ వచ్చింది. ‘స్నేహితుడా.. నన్ను కనుక్కున్నావా? ఒక రోజు నీళ్లలో కొట్టుకుపోతుంటే బతికించావు కదా!’ అన్నది. ‘గుర్తొచ్చావు’ అన్నది పావురం. ‘ఏమీ లేదు.. మా చీమల పుట్ట దగ్గర కళ్లు తిరిగి పడ్డావు. నేను బయటికి వెళ్తున్నా ఆ సమయంలో. నాకేదో కీడుతలంచి.. మా చీమల దండును పిలిచా. మా వేల సైన్యం డేగలపై దాడిచేసింది. మా తోటివాళ్లు కొందరు చనిపోయారు. మేమంతా తెగబడి కుడుతుంటే.. ఆ డేగలు పారిపోయాయి’ అన్నది గండుచీమ. ఒకరోజు చీమే కదా.. అని తక్కువ అంచనా వేసిన పావురం మనసులో పశ్చాత్తాప పడింది. ‘మనకు మనం సాయం చేసుకోకపోతే మిత్రులం ఎలా అవుతాం?’ అన్నది గండుచీమ. 

Updated Date - 2022-07-21T06:14:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising