ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆహా.. కొంగ తెలివి!

ABN, First Publish Date - 2022-09-11T09:01:36+05:30

ఒక అడవిలో నక్క ఉండేది. తనకు మాత్రమే తెలివి ఉందని అపోహపడేది. సింహం, పులి, ఎలుగు, ఏనుగు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క అడవిలో నక్క ఉండేది. తనకు మాత్రమే తెలివి ఉందని అపోహపడేది. సింహం, పులి, ఎలుగు, ఏనుగు.. లాంటి పెద్ద జంతువులకు కూడా బురిడీ కొట్టించేది. అట్లాంటి తియ్యటి మాటలు చెప్పేది. నక్క మోసం తెలిసినా.. జంతువులన్నీ దాని మాటల మాయలో పడిపోయేవి. ఆ నక్కను చంపి తిందామనే కోపం పులి, సింహాలకు వచ్చినా దానిలా తెలివి ఉన్న జంతువు ఒక్కటి కూడా అడవిలో లేదని.. అవసరం కోసం దాన్ని చంపకుండా వదిలేశాయి. ఈ విషయం తెలుసుకున్న నక్క మరింతగా రెచ్చిపోయింది. సింహం, పులి తిని విడిచిపెట్టిన ఆహారాన్ని తినేది. ఫలానా కొమ్ముల జింక తింటే బావుంటుందని మనసులో అనుకుంటే.. వెంటనే సింహానికో, పులికో చెప్పి వాటి నోరు ఊరించేది. అట్లా తన జిహ్వ చాపల్యం తీర్చుకునేది మాయదారి నక్క.


నక్క ఓ చెట్టుకింద నిద్రపోతోంది. దొంగ నిద్ర అది. చెట్టుమీద కాకులన్నీ తెగ మాట్లాడుకుంటున్నాయి. అది కూడా కొంగ గురించి పొగుడుతున్నాయి. చేపలు తినే కొంగ చాతుర్యం అద్భుతం కదా. ఆ కొంగ జపం అందరికీ రాదని కొంగను ప్రశంసిస్తున్నాయి. ఆహా.. కాకులు ఇంత బాగా మాట్లాడుకునే తెలివైన కొంగను తినాలనుకుంది. అది కూడా చేపలు తినే కొంగ మరింత రుచిగా ఉంటుందని మనసులో ఆశపడింది. ఒకరోజు నక్క గొంతులో ఏదో ఎముక ఇరుక్కుందని.. దాన్ని తీసేస్తే ఎలాంటి సాయమైనా చేస్తానని అన్ని జంతువులకూ ప్రామిస్‌ చేసింది. ఎవరూ అంత పనివాళ్లు లేరన్నారు. కొంగ తెలివైనది. దాని ముక్కు పొడవుగా ఉంటుంది. సులువుగా నక్క నోటిలో ఇరుక్కున్న ఎముకను తీసేస్తుందని ఓ రామచిలుక సలహా ఇచ్చింది. కొంగకు కబురంపింది వెంటనే నక్క. కొంగ వచ్చింది. దగ్గరకు వస్తూనే కొంగను నక్క తినేయాలనుకుంది. కొంగకు ఈ విషయం ముందే తెలుసు. తన స్నేహితులైన ఎలుగుబంట్లను రమ్మంది. రెండు ఎలుగుబంట్లు వచ్చి నక్కను పట్టుకుని నోటిని తెరవమని గట్టిగా గుంజాయి. నొప్పితో విలవిలలాడిన నక్క దూరంగా పరిగెత్తింది. 

Updated Date - 2022-09-11T09:01:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising