ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్నేహితుల ఉపాయం!

ABN, First Publish Date - 2022-09-23T05:45:30+05:30

ఒక అడవిలో ఒక నెమలి ఉండేది. దానికో చిన్న పిల్ల ఉండేది. పిల్ల నెమలి రోజూ బయటకు ఆడుకోవటానికి వెళితే అక్కడో ఎలుక, కోతి పరిచయమయ్యారు. ఇంటికొచ్చి వాళ్ల అమ్మతో తన స్నేహితుల గురించి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక అడవిలో ఒక నెమలి ఉండేది. దానికో చిన్న పిల్ల ఉండేది. పిల్ల నెమలి రోజూ బయటకు ఆడుకోవటానికి వెళితే అక్కడో ఎలుక, కోతి పరిచయమయ్యారు. ఇంటికొచ్చి వాళ్ల అమ్మతో తన స్నేహితుల గురించి చెప్పింది. తన ఇద్దరి స్నేహితుల ద్వారా రామచిలుక, జింక, కుందేలు పరిచయమయ్యారు. పిల్ల నెమలి ఎంతో సంతోషపడింది. స్నేహితులను తన ఇంటికి తీసుకెళ్లి వాళ్లమ్మను పరిచయం చేసింది. ఎక్కడికీ పోకుండా ఆడుకోండని నెమలమ్మ చెప్పింది.


ఒక రోజు నెమలి ఆహారానికి వెళ్లింది. రాత్రయినా తల్లి రాకపోవటంతో పిల్ల నెమలి ఏడ్చింది. రాత్రంతా పిల్ల నెమలికి తోడుగా కోతి, జింక  ఉన్నారు. ఏడుపు ఆపలేదు ఆ పిల్ల నెమలి. ఉదయం లేచాక.. కుందేలు, చిలుక, ఎలుక వచ్చారు. అంతా కలిసి అడవిలోకి వెళ్లారు. నెమలికోసం వెతుకుతోంటే.. పిల్ల నెమలికి ఓ పెద్ద నెమలీక కనపడింది. ఆ నెమలీక తన అమ్మదే అంటూ గట్టిగా ఏడ్చింది. ఆ నెమలీక ఆధారంగా స్నేహితులు వెతుక్కుంటూ వెళ్లారు. దూరంగా ఓ పల్లె కనిపించింది. ‘అక్కడ మనుషులు ఉంటారు. వాళ్లు క్రూరులు. నేను వెళ్లి ఓసారి చూసొస్తాను’ అంటూ చిలుక చెప్పింది. అక్కడ జామచెట్టు మీద వాలి కిందకి చూస్తే నెమలికి కట్టేశారు. అక్కడ మనుషులెవరూ లేరు. ఆ చిలుక వేగంగా వెళ్లి స్నేహితులకు చెప్పింది.


ఈ రాత్రికే మనమంతా వెళ్దాం. ఎలాగైనా తీసుకొద్దాం అని పిల్లనెమలితో కోతి చెప్పింది. అందరూ తలూపారు. మనుషులకు కనపడకుండా బోను దగ్గరకు వెళ్లారు. ఆ బోనుకి పెట్టిన పుల్లను తీసేసింది కోతి. నెమలికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. పిల్లలంతా ఇలా.. కాపాడటానికి  వచ్చారని తెలిసి సంతోషపడింది. పిల్ల నెమలి తన అమ్మ దగ్గర ఏడ్చింది. ‘మనం వెళ్లిపోదాం. మనుషులు వస్తే ప్రమాదమం’ అని కోతి చెప్పగానే తలొకదారిలో అడవిలోకి వెళ్లారు. ఆ స్నేహితుల ఽధైర్యాన్ని అడవిలోని జంతువులన్నీ కొనియాడాయి. 

Updated Date - 2022-09-23T05:45:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising