ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోషకాల లోపం కనిపెట్టేదిలా!

ABN, First Publish Date - 2022-06-28T06:15:14+05:30

మన శరీరమే అంతర్గత ఆరోగ్యానికి ప్రతిబింబం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మన శరీరమే అంతర్గత ఆరోగ్యానికి ప్రతిబింబం. తనలో లోపించిన పోషకాలను కొన్ని లక్షణాల రూపంలో శరీరరం ఎప్పటికప్పుడు బయల్పరుస్తూ ఉంటుంది. ఆ లక్షణాలకు అప్రమత్తమైతే పోషకాల లోపంతో కూడిన అస్వస్థతల నుంచి తప్పించుకోవచ్చు. 

అరచేతులు: మెగ్నీషియం తగ్గితే అరచేతులు చల్లగా తయారవుతాయి. హైపోథైరాయిడిజం లేదా గుండె బలహీనత ఉన్నప్పుడు కూడా అరచేతులు చల్లగా ఉంటాయి.

చర్మం: జింక్‌ లోపం ఉంటే చర్మం మీద స్ట్రెచ్‌ మార్క్స్‌ ఏర్పడతాయి. చిన్న దెబ్బలకే రక్తస్రావమవుతుంటే విటమిన్‌ కె లేదా విటమిన్‌ సి లోపించిందని అర్ధం. ప్లేట్‌లెట్లు తగ్గినా ఇదే లక్షణం కనిపిస్తుంది. అరచేతులు పసుపుపచ్చగా మారితే బీటాకెరోటిన్‌ ఎక్కువైందని అర్ధం. 

కాళ్లు: కాలి పిక్కలు పట్టేస్తుంటే మెగ్నీషియం తగ్గిందని అనుకోవాలి. మోకాలి కీలు పట్టేస్తున్నా మెగ్నీషియం తగ్గినట్టే!

గొంతు: గొంతు వాపు హైపోథైరాయిడ్‌కి, అయొడిన్‌ లోపానికి సూచన. 

గోళ్లు: గోళ్ల మీద తెల్లని మచ్చలు ఏర్పడితే జింక్‌ లోపించిందని అనుకోవాలి. గోళ్లు మెత్తగా మారి, విరిగిపోతుంటే మెగ్నీషియం తగ్గిందని అర్థం. 

ముఖం: ముఖం మీద, ముక్కు పక్కల ఎర్రగా కంది, తోలు లేస్తుంటే విటమిన్‌ బి2 లోపించినట్టు. నుదురు మీద, ముక్కు పక్కల నూనెతో కూడిన పొక్కులొస్తుంటే విటమిన్‌ బి6 తగ్గిందని అనుకోవాలి.

కళ్లు: క్రోమియం తగ్గితే శుక్లాలు వస్తాయి. ఫుడ్‌ అలర్జీతో కళ్ల కింద నల్లని వలయాలు, వాపు లక్షణాలు కనిపిస్తాయి. 

నోరు: నాలుక తెల్లగా, పాలిపోయి ఉంటే ఐరన్‌ లోపం అనుకోవాలి. నొప్పితో కూడిన ఎర్రని పుండ్లు ఏర్పడితే విటమిన్‌ బి3 లోపంగా భావించాలి. నాలుక వాపు అలర్జీకి గుర్తు. నాలుక నొప్పి పెడుతూ నున్నగా తయారైతే ఫోలిక్‌ యాసిడ్‌ తగ్గిందని అర్థం. విటమిన్‌ బి2 తగ్గితే పెదవులు పగులుతాయి.

Updated Date - 2022-06-28T06:15:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising