ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంట్లో ఇలా అమర్చుకుంటే...

ABN, First Publish Date - 2022-07-06T09:06:04+05:30

ఇంట్లో ఇలా అమర్చుకుంటే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంట్లోకి పాజిటివ్‌ ఎనర్జీ రావాలంటే కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. అవేమిటంటే...

ఇంట్లో అక్వేరియం ఉంటే పాజిటివ్‌ ఎనర్జీ ఉన్నట్టే. అయితే ఎక్కడ పడితే అక్కడ కాకుండా లివింగ్‌ రూమ్‌లో ఉత్తర దిక్కులో లేదా తూర్పు దిక్కులో పెట్టాలి. అక్వేరియం పెట్టుకోలేని వారు ఒకచిన్న బౌల్‌ పెట్టి అందులో చిన్న చేపను వేసి ఆహారం అందిస్తున్నా మనసుకు ప్రశాంతత లభిస్తుంది.

ఒకవేళ కిచెన్‌లో మెడిసిన్‌ బాక్స్‌ ఉంటే కనుక అక్కడి నుంచి వెంటనే మార్చండి. మందుల డబ్బా కిచెన్‌లో ఉంటే ఆరోగ్యపరమైన సమస్యలు, మానసిక సమస్యలు వచ్చిపడే అవకాశం ఉంటుంది.

ఇంట్లో తులసి మొక్క పాజిటివ్‌ ఎనర్జీ మీ చుట్టే ఉంటుంది. గాలిని శుభ్రపరచడంతో పాటు, ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి ప్రతీకగా నిలుస్తుంది తులసి. 

ఇంట్లో ముళ్ల మొక్కలకు చోటు ఇవ్వకూడదు. కాక్టస్‌ వంటి మొక్కలు ఇంట్లో ఉంటే ఆరోగ్యంపైన, కుటుంబసభ్యుల సంబంధాలపైన ప్రతికూల ప్రభావం చూపుతుంది. 

ఇంటి ప్రధాన ద్వారం దగ్గర వినాయకుడి ప్రతిమ పెట్టుకోవడం ద్వారా ఇంట్లో సంతోషం, శాంతిని ఆహ్వానించవచ్చు. ఇంట్లో లేదా ఇంటి ఆవరణలో బుద్ధుడి విగ్రహం ఉన్నా మంచి ఫలితాలు ఉంటాయి. 

ఇంట్లో విరిగిన ఫర్నిచర్‌, పగిలిన వస్తువులు ఉంటే తీసేయండి. అవి పాజిటివ్‌ ఎనర్జీని అడ్డుకుంటాయి.

Updated Date - 2022-07-06T09:06:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising