ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tonsillectomy in Children: పిల్లలకి టాన్సిలెక్టమీ ఎప్పుడవసరం అంటే..

ABN, First Publish Date - 2022-10-29T12:33:11+05:30

టాన్సిలిటిస్ అనేది ప్రధానంగా చిన్న పిల్లల్లోనూ, యుక్తవయసువారిలో కనిపించే సాధారణ సమస్య.

Tonsillectomy in Children
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చలికాలం మొదలవగానే పిల్లలపై చలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనితో టాన్సిల్స్ సమస్య మొదలవుతుంది. గొంతు తడారిపోయి, తినే ఆహారం మింగలేక ఇబ్బంది పడతారు. కడుపునొప్పి, చెవినొప్పి, తలనొప్పి, చలిజ్వరం, ఒళ్ళు నొప్పులు, అలాగే లింఫ్ గ్రంథులు వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

చలికాలం వస్తోందంటే పిల్లల్లో దగ్గు, జలుబుతోపాటు ఎక్కువగా కనిపించేది టాన్సిల్స్‌‌ సమస్య. టాన్సిలిటిస్ అనేది ప్రధానంగా చిన్న పిల్లల్లోనూ, యుక్తవయసువారిలో కనిపించే సాధారణ సమస్య. టాన్సిల్ గ్రంథుల వాపు చాలా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఇవి గొంతు వెనుక భాగంలో ఉన్న చిన్న ఓవెల్ ఆకారంలో ఉండే గ్రంథులు. ఇది నాలుగు నుంచి పన్నెండేళ్ల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ గొంతు వాపు సమస్య మరీ ఎక్కువైతే వైద్యుని సంప్రదించడం ముఖ్యం.

టాన్సిలెక్టమీ ఎందుకు అవసరం అవుతుంది.

టాన్సిల్స్ బాగా ఉబ్బి ఉండే టాన్సిలెక్టమీ చికిత్స తప్పనిసరి. సాధారణ టాన్సిల్స్ చిన్నవిగా ఉండి, వాపుతో ఎరుపుగా అండాకారంలోకి మారతాయి. ఇవి గొంతు వెనుక భాగంలో అసౌకర్యంగా మారతాయి. పిల్లల్లో టాన్సిల్స్ చాలా ఉబ్బి ఉంటే అవి సరిగా ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందిగా మారతాయి. ఈ సమస్య రాత్రి పూట ఎక్కువగా ఉంటుంది. ఇలా ఉబ్బిన టాన్సిల్స్ స్లీప్ అప్నియాకు కూడా కారణం అవుతుంది.

స్లీప్ అప్నియా అంటే..

స్లీప్ అప్నియా అంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. శ్వాస పదే పదే ఆగిపోయి మళ్ళీ అందుకుంటూ ఉంటుంది. ఈ సమస్య నిద్రలేమిని కలిగిస్తుంది. సరైన నిద్ర లేని కారణంగా రోజంతా ఆ ప్రభావం ఉంటుంది. ఇది ఎదుగుదలలోనూ, ప్రవర్తనా సమస్యలకు దారితీయవచ్చు.

టాన్సిల్స్ తో ఇతర సమస్యలు..

టాన్సిల్ వల్ల రాళ్ళు

టాన్సిల్ నుంచి రక్తస్రావం

ఆహారం మింగడం కష్టంగా మారుతుంది.

ముక్కు రంధ్రాలు మూసుకుపోయినట్టు ఉంటుంది.

గొంతులో, ముక్కు రంధ్రాల్లో కణితులు

ఇలాంటి సమస్య ఉన్నప్పుడు పిల్లలకు టాన్సిలెక్టమీ అవసరమా లేదా అనేది డాక్టర్ సూచిస్తారు. 1965 నుంచి టాన్సిలెక్టమీ చికిత్స ప్రతి సంవత్సరం గణనీయంగా తగ్గుతూ వచ్చింది. టాన్సిలెక్టోమీలు చాలా సులభమైన ప్రక్రియ. ఈ చికిత్స చేయడానికి కేవలం 30 నిమిషాలు మాత్రమే పడుతుంది.

Updated Date - 2022-10-29T12:42:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising