ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?

ABN, First Publish Date - 2022-02-26T16:12:27+05:30

రసాయనాలతో కలుషితమైన ఆహారం తినటం, ఇంటి శుభ్రతకు ఉపయోగించే క్లీనింగ్‌ కెమికల్స్‌, వాయుకాలుష్యం.. ఇలా పలు రకాలుగా మన శరీరంలో హానికరమైన పదార్థాలు పేరుకుపోతుంటాయి. అలాగే కొనసాగితే ఒత్తిడితో పాటు అనేక రకాల వ్యాధులు వస్తాయి. మానసికంగా కుంగిపోతారు కూడా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(26-02-2022)

రసాయనాలతో కలుషితమైన ఆహారం తినటం, ఇంటి శుభ్రతకు ఉపయోగించే క్లీనింగ్‌ కెమికల్స్‌, వాయుకాలుష్యం.. ఇలా పలు రకాలుగా మన శరీరంలో హానికరమైన పదార్థాలు పేరుకుపోతుంటాయి. అలాగే కొనసాగితే ఒత్తిడితో పాటు అనేక రకాల వ్యాధులు వస్తాయి. మానసికంగా కుంగిపోతారు కూడా. ఇలాంటప్పుడు శరీరానికి డీటాక్సిఫికేషన్‌ అవసరం. అనేక పద్ధతుల్లో ఈ డీటాక్సిఫికేషన్‌ చేయించుకోవచ్చు. అయితే తక్కువ ఖర్చుతో సులువుగా శరీరంలోని హానికరమైన పదార్థాలను ఇలా కూడా తొలగించుకోవచ్చు.


అనవసరమైన ఆహారాన్ని పొట్టలో వేసుకోవటమంటే.. జీర్ణాశయంపై ఒత్తిడి పెంచటమే. రసాయనాలు వాడని ఆకుకూరలు, కూరగాయలు తింటే చక్కని ఫలితం కలుగుతుంది. ముఖ్యంగా బీట్‌రూట్‌, ముల్లంగి తీసుకోవాలి. విటమిన్‌-సి దొరికే పండ్లను తినాలి. మనకు అందుబాటులో ఉండే నిమ్మకాయ రసాన్ని వాడటం మంచిది. ఈ సిట్రస్‌ ఆమ్లంలో ఫ్రీ రాడికల్స్‌ను సంహరించే గుణం ఉంది. రక్తంలోని పీహెచ్‌ విలువను బ్యాలెన్స్‌ చేస్తుంది. రోజూ గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే.. శరీరంలోని టాక్సిన్సు వదిలిపోతాయి. 


వెల్లుల్లి శరీరంలోని హానికరమైన పదార్థాలను చంపేస్తుంది. ముఖ్యంగా తెల్ల రక్తకణాలను కాపాడుతుంది. వెల్లుల్లి పచ్చిదే తిన్నా మంచిదే. తినలేని వాళ్లు కూరల్లో ఎక్కువగా ఉపయోగించాలి. ఇది యాంటీవైరల్‌, యాంటీబాక్టీరియాగా ఉపయోగపడుతుంది.


వీలైనంత వరకూ తాజా పండ్లు తినటం మంచిది. వీటికి టాక్సిన్స్‌ను వదలగొట్టే లక్షణం ఉంటుంది.


పైపులనుంచి ప్రవహించి వచ్చే నీళ్లలో భార లోహాలుంటాయి. ఖనిజ లవణాలుండే నీటిని తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి. 


తక్కువ ఖర్చులో డీటాక్సిఫికేషన్‌ చేయడమంటే.. వ్యాయామమే. సరైన తిండి, వేళకు నిద్రతో పాటు సరైన శిక్షకుడి శిక్షణలో వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయటం వల్ల ఒంట్లోని కొవ్వు కరుగుతుంది. చెమట పడుతుంది. చెమటలో వ్యర్థపదార్థాలన్నీ తొలగిపోతాయి.


డియోడరెంట్‌, హెయిర్‌డై, చర్మానికి రాసే సౌందర్య ఉత్పత్తులు వాడేవాళ్లు.. ముఖ్యంగా మేకప్‌ వేసుకోవటం వల్ల ఆ ప్రాంతంలోని చర్మంపై ఉండే అతి సూక్ష్మ రంధ్రాలను మూసివేస్తాయి. వీటికి దూరంగా ఉంటే.. మంచి ఫలితం ఉంటుంది. శరీరంలో ఇలా అనసవరంగా టాక్సిన్స్‌ పెంచుకోకుండా.. ముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. 

Updated Date - 2022-02-26T16:12:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising