ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Dengue in Pregnancy: డెంగ్యూ ఉన్నట్లు నిర్ధారణ అయిన గర్భిణీ స్త్రీలలో కనిపించే లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు..

ABN, First Publish Date - 2022-09-10T15:29:35+05:30

డెంగ్యూతోబాధపడుతున్న గర్భిణీ స్త్రీలలో వ్యాధి ప్రభావం శిశువుకు వ్యాపించే అవకాశాలున్నాయా? తీసుకోవల్సిన జాగ్రత్తలు ఏమిటి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డెంగ్యూతోబాధపడుతున్న గర్భిణీ స్త్రీలలో వ్యాధి ప్రభావం శిశువుకు వ్యాపించే అవకాశాలున్నాయా? తీసుకోవల్సిన జాగ్రత్తలు ఏమిటి.


డెంగ్యూ అనేది ఫ్లావివిరిడే, జెనస్ ఫ్లావివైరస్ కు చెందిన దోమల ద్వారా సంక్రమించే వ్యాధి. ఈ దోమ మానవ శరీరంలో రక్తాన్ని పీల్చిన తరువాత రక్తప్రవాహంలోకి వైరస్ ప్రవేశించిన తరువాత వ్యాధి సోకుతుంది. ఈ దోమలు సాధారణంగా పగటిపూట కుడతాయి. ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం కూడా ఉంది. గర్భిణీ స్త్రీకి వ్యాధి గర్భధారణ సమయంలో లేదా ప్రసవ సమయంలో వైరస్ సోకినట్లయితే అది తన బిడ్డకు కూడా వ్యాపిస్తుంది. 


లక్షణాలు..

డెంగ్యూతో బాధపడుతున్న గర్భవతిలో శరీరం నొప్పి, మైయాల్జియా, కీళ్ల నొప్పులు, కళ్ల వెనుక నొప్పి, తలనొప్పి మొదలైన లక్షణాలతో జ్వరం వస్తాయి. వాంతులు, వికారం, గొంతు నొప్పి, దద్దుర్లు, చర్మం సాధారణంగా ఎర్రబడినట్లు ఉంటుంది. గర్భిణీ రోగులలో శరీర భాగాలు చల్లగా మారతాయి. బద్దకంగా, వాంతులు, కడుపు నొప్పి లక్షణాలుంటాయి. 


డాక్టర్‌ని ఎప్పుడు సంప్రదించాలి ?

వ్యాధి సోకిన గర్భిణీ స్త్రీలు డెంగ్యూ పాజిటివ్ అని తేలితే తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. డెంగ్యూ వైరస్ గర్భవతిగా ఉన్నప్పుడు, ప్రసవ సమయంలో శిశువుకు సంక్రమించినా, అది చాలా అరుదుగా శిశువు మీద ప్రభావం చూపుతుంది. వైరస్‌ను త్వరగా గుర్తించడం, సకాలంలో వైద్య సహాయం కోరడం వలన బిడ్డను తల్లిని సురక్షితంగా కాపాడుకోవచ్చు.


చికిత్స..

చికిత్స మామూలు వ్యాధిగ్రస్థులకు ఇచ్చే విధంగానే ఉంటుంది. అయితే డెంగ్యూ లక్షణాలు ఉన్నవారితో మసిలేవారు వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దోమ కాటు నుంచి రక్షించుకునే జాగ్రత్తలు అవసరం. నిండుగా చేతులున్న దుస్తులు ధరించడం, దోమలు తిరిగే ప్రదేశాలను గుర్తించి వాటి నిర్మూలనకు చర్యలు తీసుకోవాలి. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. 

Updated Date - 2022-09-10T15:29:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising