ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సరిగ్గా నిద్రపట్టడం లేదా? ఈ చిట్కాలు పాటించండి..!

ABN, First Publish Date - 2022-01-30T19:00:49+05:30

భారతీయులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారతీయులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నూటికి 90 శాతం నిజం. అవును... మనదేశంలో ఎక్కువ మంది నిద్రలేమితో బాధపడుతున్నారని పరిశోధనల్లో తేలింది. కరోనాతో వచ్చిన మార్పుల్లో కీలకమైన సమస్య ఇది. ఆందోళన, కుంగుబాటు, ఒత్తిడి, నిరాశానిస్పృహల కారణంగా చాలామంది నిర్ణీత ఏడు గంటల కంటే తక్కువగా నిద్రపోతున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో కంటి నిండా కునుకు తీయాలంటే ఏం చేయాలి?


కరోనా మహమ్మారి కారణంగా గుండెల్లో ఏదో తెలియని గుబులు,  ఆందోళన. ఎప్పుడు ఏమవుతుందో తెలియని అనిశ్చితి వాతావరణం. పైగా వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌, ఆన్‌లైన్‌ క్లాసుల వల్ల స్ర్కీన్‌ చూస్తూ గంటలు గంటలు గడపడం మామూలైంది. దీని వల్ల నిద్రపోవడం తగ్గింది. అయితే మిగతా వారికంటే యాభై ఏళ్లు దాటిన వారి ఆరోగ్యంపై ఇది తీవ్ర పరిణామం చూపిస్తుంది. ఈ సమస్య వల్ల మధుమేహం, ఊబకాయం, హృద్రోగాలు, అధిక రక్తపోటు తదితర ఆరోగ్య సమస్యలకు లోనుకావొచ్చు. 


బెడ్‌రూమ్‌ రూల్స్‌...

చాలా మంది ఈమధ్య తమ పడకగదినే ఆఫీస్‌ కమ్‌ డైనింగ్‌ రూమ్‌గా మార్చేసుకుంటున్నారు. ఏమంటే... తప్పని పరిస్థితి అంటున్నారు. అయితే ‘ఈ అలవాటును సాధ్యమైనంత వరకు తగ్గించుకోవడం మంచిదం’టున్నారు స్లీప్‌ ఎక్స్‌పర్ట్స్‌. వారి అభిప్రాయం ప్రకారం బెడ్‌రూమ్‌ను కేవలం పడకగదిలా ఉపయోగించుకుంటే మంచిది. అలాగే అక్కడి వాతావరణం నిశ్శబ్దంగా ఉండాలి. సుఖవంతమైన నిద్ర కోసం వీటిని తక్షణమే పాటించాలి.


సాఫ్ట్‌ సిలికాన్‌ లేదా ఫోమ్‌ ఇయర్‌ ప్లగ్స్‌ను ఉపయోగించి అనవరమైన శబ్దాలను వినపడకుండా చేయవచ్చు. 


సరైన తలగడ లేకున్నా నిద్ర సరిగా పట్టదు. పైగా మెడనొప్పి వస్తుంది. కాబట్టి మీకు తగినటువంటి తలగడను ఎంచుకోవాలి. 


నిద్రపై మనం కప్పుకునే దుప్పటి కూడా ప్రభావం చూపుతుందని తెలుసా? ఏదో ఓ దుప్పటి అని కాకుండా కాస్త బరువైన దుప్పటిని కప్పుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఉదాహరణకు 45 కేజీల బరువున్న వ్యక్తి ఏడు కిలోల బరువున్న బ్లాంకెట్‌ను కప్పుకోవడం వల్ల సుఖవంతమైన నిద్రను సొంతం చేసుకోవచ్చు. 


నిద్రలో తరచూ లేవడానికి వేడి, ఉక్కబోతగా ఉండటమే అంటారు చాలామంది. దానికి కారణం... వాతావరణం కావొచ్చు, మందుల వాడకం వల్ల కావొచ్చు, లేదంటే హార్మోనల్‌ సమస్యలు కావొచ్చు. సాధారణంగా నిద్రపోయినప్పుడు శరీర ఉష్ణోగ్రతలు కొన్ని డిగ్రీలు తగ్గుతాయి. అందుకే పరుపుల ఉత్పత్తిదారులు అందుకనుగుణంగా ఉండే సరికొత్త పరుపులను, కూల్‌ ఫ్యాబ్రిక్‌ను వినియోగించి తయారు చేస్తున్నారు. 


నిద్రవేళల్లో క్రమశిక్షణ పాటించడం ఆరోగ్యకరం. ఏడు నుంచి తొమ్మిది గంటల నిద్రపోయినా ఇంకా చిరాకుగా ఉన్నారంటే వైద్యుడిని సంప్రదించాల్సిందే. అలాగే మితిమీరిన నిద్రను కుంగుబాటుకు ఓ లక్షణంగా గుర్తించాలి. చక్కటి నిద్ర ఓ దివ్యౌషధం. అది మనసుకు, శరీరానికి ప్రశాంతతను చేకూరుస్తుంది. ఆందోళనలను తగ్గిస్తుంది. మెదడును ఉత్సాహంగా ఉంచుతుంది. కాబట్టి అన్ని వయసుల వారూ ఎలాంటి పరిస్థితులల్లో కూడా నిద్రను అశ్రద్ధ చేయకూడదు.


వీటిని ట్రై చేయండి...

పడుకున్న వెంటనే నిద్ర పట్టేలా ఏదైనా మ్యాజిక్‌ చేస్తే బాగుంటుందని చాలామంది అనుకుంటారు. సరైన నిద్ర కోసం అందుబాటులో ఉన్న చిట్కాలివి... 

నిద్రకు సంబంధించి ‘కామ్‌’, ‘హెడ్‌స్పేస్‌’ లాంటి యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా సరైన పద్ధతిలో మెడిటేషన్‌, బ్రీతింగ్‌ ఎక్స్‌ర్‌సైజులు చేయవచ్చు. తద్వారా సుఖనిద్రను సొంతం చేసుకోవచ్చు. 


ఆందోళనలను తగ్గించి, హాయిగా నిద్రపోయేలా పురిగొల్పే లక్షణాలు చామంతి టీలో ఉన్నాయి. దీనిని సేవించడం ద్వారా ఇందులోని ఎపిజెనిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ ఆందోళనను తగ్గించి, నిద్రకు ప్రేరేపిస్తుంది.


స్లీప్‌ మాస్కులు చక్కని నిద్రకు దోహదం చేస్తాయి. రాత్రి వేళల్లో కృత్రిమ కాంతులు మెదడుకు తప్పుడు సంకేతాలు అందించి నిద్రకు భంగం కలిగించవచ్చు. పడక గదుల్లోని కిటీకీల్లోంచి వీధి లైట్లు, ఇతరత్రా కాంతి పడకుండా జాగ్రత్త పడితే మంచిది.


చీకటికి ప్రతి చర్యగా మెదడు సహజసిద్ధంగా మెలటోనిన్‌ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే మెలటోనిన్‌ డిఫీషియెన్సీ ఉన్న వాళ్లు సప్లిమెంట్ల ద్వారా కొంత ఉపశమనం పొందవచ్చు. ఇంకా మెగ్నీషియమ్‌ కూడా నిద్రకు ఉపకరించే ఖనిజం. కండరాలను రిలాక్స్‌ చేయడంతో పాటు ఆందోళనను తగ్గిస్తుంది.


ఉదయం పూట ‘లైట్‌ - థెరపీ బాక్స్‌’ ముందు ఓ గంట కూర్చుంటే హాయిగా నిద్రపడుతుందని ‘ఏ స్లీప్‌ అండ్‌ బయోలాజికల్‌ రిథమ్స్‌’ పరిశోధనలు వెల్లడించాయి. దీని వల్ల మెలటోనిన్‌ ఉత్పత్తి అయి రాత్రిళ్లు హాయిగా నిద్రపోవడానికి ఉపయోగపడుతుంది.


Updated Date - 2022-01-30T19:00:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising