ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

sleep like a baby : ఈ నియమాలతో చంటిపిల్లల్లా నిద్రపోండి..!

ABN, First Publish Date - 2022-09-23T16:28:19+05:30

నిద్ర అనేది శరీరంలోని నాడీ, జీవక్రియ, జీవ సంబంధమైన విధులకు అవసరమైన పునరుద్దీకరణ స్థితి. ఇది లేకపోవడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు, మానసిక రుగ్మతలు మొదలైన అనారోగ్య సమస్యలు వస్తాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిద్రలేమి మనలో సాధారణంగా కనిపించే సమస్య.. రాత్రిపూట ఎక్కువసేపు మేల్కొని ఉండటం, పదే పదే ఫోన్స్, టీవి వంటి స్క్రీన్స్ చూడటం వల్ల నిద్రలేమి మొదలవుతుంది. నిద్ర అనేది శరీరంలోని నాడీ, జీవక్రియ, జీవ సంబంధమైన విధులకు అవసరమైన పునరుద్దీకరణ స్థితి. ఇది లేకపోవడం వల్ల గుండె సంబంధ వ్యాధులు, మానసిక రుగ్మతలు మొదలైన అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి రాత్రిపూట కనీసం 7-8 గంటలు నిద్రపోవడం తప్పనిసరి. కానీ చాలామందికి అలా చేయడం కష్టం. పీడియాట్రిక్స్ మాటేమంటే మంచి రాత్రి నిద్ర కోసం ఐదు పాయింట్ల నియమాన్ని పెట్టుకోమని సలహా ఇస్తున్నారు.


చక్కని నిద్ర కోసం నిమయాలు..

1. పడుకునే ముందు కెఫీన్ ను తీసుకోకపోవడం మంచిది.


2. నిద్రకు మూడు గంటల ముందు కడుపు నొప్పిని కలిగించే ఆహారాన్ని తీసుకోకండి.


3. పడుకునే రెండు ముందు ఇంటిపనిని పూర్తి చేసుకోండి.


4. ఈ నియమాలను పాటించడం వల్ల సమయానికి నిద్రపోవడం వల్ల శరీరం బాగా విశ్రాంతిని తీసుకుంటుంది. ఇది మరుసటిరోజు ఉదయం ఉత్సాహంగా ఉండడానికి మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. 


5. అలాగే నిద్రపోవడానికి 10 గంటల ముందు కెఫీన్ ను తీసుకోవడం వల్ల అది మన రక్తప్రవాహంలో చేపి ఉంటుంది. అదే విధంగా రాత్రి భోజనం భారీగా తీసుకున్నా, ఆల్కహాల్ తీసుకున్నా కూడా అది నిద్రకు భంగం కలిగిస్తుంది. 


6. అలాగే నిద్రపోవడానికి కాస్త ముందే భోజనం చేయడం వల్ల శరీరం క్షితిజ సమాంతర స్థితిలో ఉన్నప్పుడు జీర్ణ ప్రక్రియ, కడుపు ఆమ్లాలు ప్రభావవంతంగా పనిచేయలేవు. దీనివల్ల యాసిడ్ రిఫ్లక్స్ అయ్యి అజీర్ణం కలుగుతుంది.


సరైన నిద్రకు ఇలా రిలాక్స్ కండి..

1. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి కుటుంబం, స్నేహితులు, సన్నిహితులతో ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి.


2. నిద్రకు గంట ముందు నుంచి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వాడకాన్ని తగ్గించాలి, వీటిని చూడటం వల్ల వచ్చే నీలి కిరణాలు మెదడును ఉత్తేజపరుస్తాయి దానితో పాటు మెలటోనిన్ (స్లీప్ హార్మోన్) ను కూడా తగ్గిస్తుంది. ఇవి మంచి ప్రశాంతమైన నిద్రను నియంత్రిస్తాయి. 


3. మరుసటిరోజు చేయాల్సిన పనులు, కలవాల్సిన పనులు ఇలా తర్వాతి రోజు కార్యక్రమాలన్నీ మెదడులో పదే పదే అనుకోవడం వల్ల కూడా నిద్రకు భంగం కలుగుతుంది. దీనికి బదులు ఓ పేపర్ మీద మీ తరువాతి రోజు కార్యక్రమాలు రాసుకుంటే అక్కడితో మెదడుకు విశ్రాంతి కలుగుతుంది. మెదడు రిలాక్స్ అవుతుంది. అలాగే ముఖ్యమైన ఇతర పనులను కూడా పడుకునే సమయానికి రెండు గంటల ముందే పూర్తిచేసుకోవడం వల్ల మరింత విశ్రాంతి తీసుకునేందుకు వీలుంటుంది.

Updated Date - 2022-09-23T16:28:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising