ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రిస్క్‌ తగ్గించుకోండిలా..!

ABN, First Publish Date - 2022-01-20T05:49:41+05:30

ఈ మధ్య కాలంలో రొమ్ము కేన్సర్‌ బారినపడే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే జీవనవిధానంలో మార్పులు చేసుకోవడం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ మధ్య కాలంలో రొమ్ము కేన్సర్‌ బారినపడే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే జీవనవిధానంలో మార్పులు చేసుకోవడం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆ రిస్క్‌ను తగ్గించుకోవచ్చని అంటున్నారు నిపుణులు. వారు సూచిస్తున్న టిప్స్‌ ఇవి...


అధిక బరువు ఉన్నట్లయితే తగ్గించుకోవాలి. ఎత్తుకు తగిన బరువు ఉంటే చాలా వరకు అనారోగ్యం దరిచేరకుండా ఉంటుంది.

వేపుడు పదార్థాలు, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం బాగా తగ్గించాలి. సీజనల్‌గా లభించే పండ్లు ఎక్కువగా తినాలి. కూరగాయలకు ప్రాధాన్యం ఇవ్వాలి. 

వ్యాయామం దినచర్యలో భాగంగా చేసుకోవాలి. శారీరక వ్యాయామం తప్పనిసరి అని గుర్తుపెట్టుకోవాలి. రోజూ కనీసం నలభై ఐదు నిమిషాలు వ్యాయామం చేయాలి. వాకింగ్‌, యోగా... మీకిష్టమైనవి చేయవచ్చు.

తల్లి అయిన తరువాత బ్రెస్ట్‌ ఫీడింగ్‌ తప్పనిసరిగా కొనసాగించాలి. పాలిచ్చే తల్లుల్లో రొమ్ము కేన్సర్‌ రిస్క్‌ తక్కువ అని అధ్యయనాల్లో తేలింది.

ఠి ఒత్తిడిని తగ్గించుకోవాలి. మెడిటేషన్‌, ధ్యానం వంటివి చేయడం ద్వారా ఒత్తిడి నుంచి బయటపడాలి. 

Updated Date - 2022-01-20T05:49:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising