ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

High Protein Food: శాఖాహారులకు ప్రొటీన్‌తో కూడిన ఆహారాలు...కణజాల నిర్మాణంలో ప్రోటీన్స్ అవసరం..

ABN, First Publish Date - 2022-08-30T18:05:49+05:30

శాఖాహారులు తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు ఉంటున్నాయా అనే విషయంగా చాలా ఆందోళన చెందుతుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మానవ శరీరంలో ప్రతి కణం, ప్రతి కణజాల నిర్మాణానికి ప్రోటీన్స్ ఎంతో అవసరం. శాఖాహారులు తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు ఉంటున్నాయా అనే విషయంగా చాలా ఆందోళన చెందుతుంటారు. మనం తీసుకునే ప్రోటీన్ తో ఉన్న ఆహారపదార్థాల వివరాలను తెలుసుకుందాం. 


చిక్కుడు, బీన్స్, కాయ ధాన్యాలు..

అన్నిరకాల కాయధ్యాన్యాలలోనూ ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో కేవలం ప్రోటీన్ మాత్రమే కాకుంండా ఐరన్, న్యూట్రీషియన్స్ కూడా ఉంటాయి. అయితే కాయ ధాన్యాలలో డైటరీ ఫైబర్, ఐరన్, ఫాస్పరస్ అధికంగా ఉంటాయి. ఉదాహరణకు ఒక కప్పు కిడ్నీ బీన్స్ 13.5 గ్రాముల ప్రోటీన్ ను ఇస్తుంది. 


క్వినోవా, తృణధాన్యాలు..

ఆహార పదార్థాలలో 100 గ్రాములుక 18 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. క్వినోవాలో ఖనిజాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు డైటరీ ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. 


గుమ్మడి గింజలు..

గుమ్మడి గింజలలో ప్రోటీన్ అధికంగా ఉంటాయి. వీటితోపాటు  కొవ్వు పదార్ధాలు, లినోలిన్ యాసిడ్, ఒలిక్ యాసిడ్, డైటరీ ఫైహర్ పుష్కలంగా ఉన్నాయి.


గింజలు, విత్తనాలు..

నువ్వులు, పొద్దుతిరుగుడు విత్తనాలతో పాటు వేరుశెనగ, బాదం, జీడిపప్పు, ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. వ్యాయామం తరువాత లేదా అప్పుడప్పుడు స్నాక్ గా వీటిని తీసుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. 


ఇవి మనల్ని ఫిట్ గా ఉంచుతాయి. జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఈ ఆహార పదార్థాలు ఆరోగ్యకరమైనవి అలాగే శరీరంలోని అన్ని పోషక అవసరాలను తీరుస్తాయి. 

Updated Date - 2022-08-30T18:05:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising