ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ovarian cancer: 30 ఏళ్లు దాటాకా పిల్లలు పుట్టారా.. బరువు పెరిగారా... అండాశయ కేన్సర్ లక్షణాలు కారణాలు..!

ABN, First Publish Date - 2022-07-28T21:01:02+05:30

అండాశయంలో క్యాన్సర్ కణాలు విపరీతంగా పెరగడం వల్ల అండాశయ క్యాన్సర్ వస్తుంది. చాలామంది స్త్రీలు రెండు అండాశయాలతో ఉంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్త్రీలలో వచ్చే క్యాన్సర్ లలో ముఖ్యమైన అండాశయ క్యాన్సర్ చాలా నెమ్మదిగా శరీరంలో మొదలవుతుంది. ఈ క్యాన్సర్ శరీరంలో ఉందనేది కూడా చాలా నెమ్మదిగానే బయటపడుతుంది. అండాశయంలో క్యాన్సర్ కణాలు విపరీతంగా పెరగడం వల్ల అండాశయ క్యాన్సర్ వస్తుంది. అయితే అండాశయ క్యాన్సర్ కి నివారణ లేకపోయినా, ప్రమాద స్థాయిని తగ్గించడానికి దీని లక్షణాలను అర్థం చేసుకోవడం అవసరం అంటున్నారు నిపుణులు.


అండాశయ క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉన్న పరిస్థితులు:


1. ఊబకాయం.

ఊబకాయం చాలా సమస్యలకు దారితీయవచ్చు. ఈ సమస్యలలో ఒకటి అండాశయ క్యాన్సర్. సగటు బరువు కంటే ఎక్కువ ఉన్న స్త్రీలకు అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.


2. వృద్ధాప్యం.

అండాశయ క్యాన్సర్ ఉన్న చాలా కేసుల్లో 55 నుంచి 64 సంవత్సరాల వయస్సులో ఉన్నవారికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 


3. గర్భం ఆలస్యం కావడం.

30 ఏళ్ల తర్వాత పిల్లలు కలిగిన మహిళలకు అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పిల్లలు పుట్టని మహిళలకు కూడా ఈ సమస్య వచ్చే ప్రమాదం ఉంది.


4. మెనోపాజ్ తర్వాత హార్మోన్ థెరపి.

మెనోపాజ్ సమస్యతో బాధపడుతున్న మహిళలకు హార్మోన్ థెరపీ చాలా సాధారణం. ఈ మందులు మెనోపాజ్ లక్షణాలను తగ్గించడానికి పని చేస్తాయి కానీ అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.


5. కుటుంబ చరిత్ర.

ఇతర క్యాన్సర్‌ల మాదిరిగానే, కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉన్న వ్యక్తులు అండాశయ క్యాన్సర్‌ వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంది.


6. Infertility

Infertility సమస్యలను ఎదుర్కొన్న లేదా గర్భం ధరించడంలో సమస్య ఉన్న స్త్రీలకు అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.


7. ధూమపానం.

ధూమపానం శరీరంలో క్యాన్సర్ కణాల అభివృద్ధికి కారణమవుతుందని నిరూపించబడింది. ఈ ప్రమాదం అండాశయ క్యాన్సర్‌కు కూడా వర్తిస్తుంది.


8. ఇతర పరిస్థితులు

కొన్ని జన్యుపరమైన సమస్యలు, మధుమేహం, ఎండోమెట్రియోసిస్ మొదలైనవి అనేక ఇతర పరిస్థితులు తరువాత అండాశయ క్యాన్సర్‌కు దారితీయవచ్చు. 


అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చా?

అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి:


1. అవయవ తొలగింపు..

గర్భాశయ శస్త్రచికిత్స, అండాశయాల తొలగింపు, ఫెలోపియన్ ట్యూబ్‌ల తొలగింపు మొదలైన అవయవాలను తొలగించడం వల్ల అండాశయ క్యాన్సర్‌ వచ్చే అవకాశం లేదని కొన్ని అధ్యయనాలు తేల్చాయి. 


2. గర్భనిరోధకాలు లోపలికి తీసుకోవడం..

గర్భనిరోధక మాత్రలు వంటి నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధకాలు అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఎక్కువ కాలం వినియోగిస్తే అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.


లక్షణాలు..

* బుతు చక్రంలో మార్పులు

* సెక్స్ సమయంలో నొప్పి

* గుండెల్లో మంట

* నడుము, పొత్తి కడుపు భాగాలలో నొప్పి

* పొత్తి కడుపు వాపు

* ఆకలి లేమి

* బరువు తగ్గడం

* వికారం 

* మలబద్ధకం

* ఉబ్బరం

* శ్వాస ఆడకపోవడం

* అలసట

* తరచుగా మూత్ర విసర్జన కావడం


ప్రతి ఒక్కరిలోనూ క్యాన్సర్ గురించిన అవగాహన అవసరం. దీనితోపాటు సమస్యను చిన్నగా ఉన్నప్పుడే గుర్తించాలంటే రెగ్యులర్ చెకప్స్ కూడా అవసరమే. దీనివల్ల ప్రమాదాన్ని ముందుగా గుర్తించే వీలు కలుగుతుంది. దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. 

Updated Date - 2022-07-28T21:01:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising