ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిద్రలేమి సమస్యకి నివారణ ఇది...

ABN, First Publish Date - 2022-07-13T21:44:00+05:30

పని మీద ఏకాగ్రత పెరగడానికి, రోజు మొత్తం ఎలాంటి సమస్య లేకుండా సాఫీగా గడిచిపోవడానికి ఆరోగ్యకరమైన 8 గంటల నిద్ర తప్పనిసరిగా అవసరమని వైద్యులు చెబుతారు. అయితే రోజులో 7,8 గంటల సేపు నిద్రపోయినా చిరాకు, అసహనం, అసౌకర్యం, పనిమీద ఏకాగ్రత లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయంటే మాత్రం ఖచ్చితంగా నిద్రకు సంబంధించిన అనారోగ్య సమస్య ఏదో ఉందనే అర్థం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

"కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది.. కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది.. కలలె మనకు మిగిలిపోవు కలిమి చివరకూ..ఆ కలిమి కూడ దోచుకునే దొరలు ఎందుకూ..." అని వాపోయారు మనసు కవి ఆత్రేయ. అయితే, మనలో చాలా మందికి కునుకు పట్టనీకుండా, కలతలు లేని కమ్మని నిద్దర పోనీయకుండా కావలి కాస్తా ఉంటుంది నిద్రలేమి అనే పెద్ద రుగ్మత. దానిని ఎలా ఎదుర్కోవాలనేది..ఇప్పుడు చూద్దాం.


మనిషికి ఖచ్చితంగా అవసరమైన వాటిలో ఆహారం, నీరు, గాలి ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే అవసరం. నిద్ర శరీరానికి ఒక విశ్రాంతి వ్యవస్థ. అంతేకాకుండా నిద్ర వల్ల శరీరం శక్తిని తిరిగి ఉత్పత్తి చేసుకుంటుంది. ఆ శక్తి వల్లనే రోజు మొత్తం మెలకువగా ఎన్నో పనులు చేస్తూ, ఎంతో ఒత్తిడిని భరించగలుగుతుంది. పని మీద ఏకాగ్రత పెరగడానికి, రోజు మొత్తం ఎలాంటి సమస్య లేకుండా సాఫీగా గడిచిపోవడానికి ఆరోగ్యకరమైన 8 గంటల నిద్ర తప్పనిసరిగా అవసరమని వైద్యులు చెబుతారు. అయితే రోజులో 7,8 గంటల సేపు నిద్రపోయినా చిరాకు, అసహనం, అసౌకర్యం, పనిమీద ఏకాగ్రత లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయంటే మాత్రం ఖచ్చితంగా నిద్రకు సంబంధించిన అనారోగ్య సమస్య ఏదో ఉందనే అర్థం. 


సమస్యలు!!


చాలామందిలో కనిపించే  నిద్రకు సంబంధించిన సమస్యలు 


ఒకటి నిద్రలేమి సమస్య


రెండు అతినిద్ర


◆ నిద్ర సంబంధించిన సమస్య అనేది రోజువారీ జీవన విధానం పైన ఆధారపడి ఉంటుంది. అది ముఖ్యంగా ఉదయం నిద్రలేవడం నుండి రాత్రి పడుకునే వరకు చేసే పనులను బట్టి సుఖంగా నిద్రపోవడం లేదా నిద్రలేమి సమస్య ఎదురుకావడం జరుగుతుంది.


◆ రాత్రి సమయంలో ఎవరైతే చక్కగా నిద్రపోతారో వారిలో మానసిక సమస్యలు చాలా తక్కువ ఉంటున్నట్టు పరిశోధకులు పేర్కొన్నారు. అంటే రాత్రిపూట  నిద్ర మెదడుపై కలిగే ఒత్తిడిని చాలావరకు తగ్గించడం ఇందుకు కారణం.


◆ కొందరికి పగటి సమయంలో నిద్రపోవడం అలవాటుగా ఉంటుంది. ముఖ్యంగా ఇంటిపట్టున ఉండే వాళ్లలో ఈ అలవాటు ఎక్కువగా ఉంటుంది. పగటి సమయంలో విశ్రాంతి తీసుకోవడం వల్ల రాత్రి సమయంలో నిద్రపట్టకపోవడం చాలామంది ఎదుర్కొనే సమస్య.


◆ ఎక్కువగా దూరప్రయాణాలు చేసేవాళ్ళు నిద్రకు సంబంధించిన సమస్యలకు తొందరగా గురవుతారు. గందరగోళమయ్యే నిద్రవేళలు దీనికి ప్రధానకారణం అవుతాయి.


◆ పగటి సమయంలో ఉద్యోగాలు, ఇతర పనులు చేసుకుని రాత్రిపూట సరైన నిద్రకు నోచుకొనివాళ్ళలో చురుకుదనం లేకపోవడం, ఏ పనిమీద ఆసక్తి లేకపోవడం, చేసే పనులు మొక్కుబడిగా చేయడం, ముఖ్యంగా ఎప్పుడూ మగతగా అనిపించినట్టు ఉండటం వంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. 


◆అతి నిద్ర ఉన్నవాళ్ళలో నిద్రను ప్రేరేపించే ఆహారపదార్థాలు, లేదా పానీయాలు ఎక్కువ తీసుకోవడం అనేది గమనించవచ్చు. 


పరిష్కారాలు!!


◆నిద్రలేమి సమస్య లేదా అతినిద్ర అనే సమస్యలకు పరిష్కారం ఏదైనా ఉందంటే అది జీవనశైలిని ఆరోగ్యకరంగా ఉంచుకోవడం.


◆ సమయపాలన అనేది ఎంతో ముఖ్యం. ఉదయం లేవడం నుండి రాత్రి పడుకునేవరకు ఒక సమయ పట్టిక పాటించడం  ఆరోగ్యకర జీవనవిధానాన్ని నిర్వహించుకునేలా చేస్తుంది.


◆ తీసుకునే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అతినిద్రను దూరంగా పెట్టచ్చు. అలాగే నిద్రలేమి సమస్యను కూడా పరిష్కరించుకోవచ్చు.


◆ కొన్నిసార్లు పనుల ఒత్తిడి ఎక్కువైనప్పుడు నిద్రను ఆపుకోవడం కోసం కాఫీలు ఎక్కువగా తాగుతారు. అందులో ఉండే కెఫిన్ నిద్రను దూరం చేస్తుంది. ఈ అలవాటు ఎక్కువైతే నిద్రలేమి సమస్య చాపకింద నీరులా  శరీరంలో చేరుతుంది.


◆ రాత్రి సమయాల్లో ఎక్కువసేపు మేలుకోవలసి రావడం, పగటి సమయాల్లో నిద్రపోవడం వంటివి జరుగుతూ ఉంటే నిద్ర సంబంధ సమస్యలు చుట్టుముడతాయి. కాబట్టి వీటిని దరిచేరనివ్వకూడదు.


◆ రాత్రిపూట తరచుగా మెలకువ వస్తుంటే నిద్ర సంబంధ సమస్య ఉన్నట్టుగా గుర్తించి వైద్యులను సంప్రదించాలి.


◆ రాత్రిళ్ళు చదువుకోవడం లేదా వృత్తిపరమైన సమస్యల కోసం మేలుకోవడం, టీవీ చూడటం, నెట్ బ్రౌజింగ్ వంటి అలవాట్లు నిద్ర సంబంధ సమస్యను సృష్టిస్తాయి.


◆  ఆస్తమా, శ్వాససంబంధ సమస్యలు ఉన్నవాళ్ళలో నిద్రలేమి సమస్య ఎదురవుతుంది. గురకపెట్టడం, నిద్రపోయే వాతావరణం సరిగ్గా లేకపోవడం, సరిపడినంత  గాలి ప్రసరణ లేకపోవడం కూడా ఈ సమస్యకు కారణం అవుతుంది. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.


◆అన్నిటికి మించి అతి ఆలోచనలు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలను చాలా రోజులపాటు మోస్తూ ఉండటం వల్ల కూడా నిద్రలేమి, ఇతర నిద్రసంబంధ సమస్యలు చుట్టుముడతాయి. 


◆ సమస్యను గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. మెదడును విశ్రాంతి మార్గంలోకి తీసుకెళ్లే యోగ, ధ్యానం చేయడం గొప్ప ఫలితాలు ఇస్తాయి.

Updated Date - 2022-07-13T21:44:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising