ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరోగ్యం ‘అలవాటు’గా!

ABN, First Publish Date - 2022-03-16T05:30:00+05:30

తెల్లారుజామునే నిద్రలేచాక గోరువెచ్చని నీళ్లు తాగాలి. లేదా గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగాలి. ఇలాచేస్తే మీ ఒంట్లో తాజాదనం వస్తుంది.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీవనశైలిని బట్టే ఆరోగ్యం ఉంటుంది. చక్కని ఆరోగ్యం కోసం.. అలవరచుకోవాల్సిన కొన్ని అలవాట్లు!


తెల్లారుజామునే నిద్రలేచాక గోరువెచ్చని నీళ్లు తాగాలి. లేదా గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగాలి. ఇలాచేస్తే మీ ఒంట్లో తాజాదనం వస్తుంది. ఆ తర్వాత వాకింగ్‌ లేదా యోగా చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని విషపదార్థాలు తొలగిపోతాయి. రన్నింగ్‌ చేయటం వల్ల మరింత చురుకుగా, దృఢంగా తయారవుతారు. బరువు తగ్గుతారు. ఫిట్‌గా తయారవుతారు. రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. 


కచ్చితమైన ఆహారవేళలు పాటించాలి. కార్బొహైడ్రేట్స్‌ తగ్గించి పండ్లు, తాజా కూరగాయలతో చేసిన ఆహారం తినాలి. 


బరువు తగ్గాలని పొట్టను అదే పనిగా ఖాళీగా ఉంచద్దు. లోపల గ్యాస్‌ ఫామ్‌ అవుతుంది. మితిమీరిన తిండి ఎంత నష్టమో.. తినకపోవడమూ అంతే నష్టాన్ని చేకూర్చుతుంది.


దప్పిక అయినా లేకున్నా నీళ్లను బాగా తాగాలి.  


ఇంట్లోవారితో రోజు కనీసం గంటపాటు సమయం గడపాలి. సాధ్యమైనంత వరకూ కామిక్‌ పుస్తకాలు, వీడియోలతో పాటు నవ్వించే స్నేహితులతోనూ కబుర్లు చెప్పుకోవాలి. నవ్వుకుంటే.. ఒత్తిడి తగ్గుతుంది. 


రాత్రి పదిలోపలే నిద్రపోవాలి, కనీసం ఏడుగంటల నిద్ర ఉండాల్సిందే. సరైన నిద్ర మంచి ఆరోగ్యాన్నిస్తుంది. రోజంతా తాజాగా ఉంచుతుంది. శరీరానికి నిద్రే అద్భుతమైన రీచార్జ్‌!

Updated Date - 2022-03-16T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising