ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిజేరియన్‌ తర్వాత తొలి నెలసరి

ABN, First Publish Date - 2022-08-16T16:26:42+05:30

సిజేరియన్‌ తర్వాత తొలి నెలసరి శరీర తత్వం, పాలిచ్చే ఫ్రీక్వెన్సీ, హార్మోన్ల స్థితిగతుల మీద ఆధారపడి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిజేరియన్‌ తర్వాత తొలి నెలసరి శరీర తత్వం, పాలిచ్చే ఫ్రీక్వెన్సీ, హార్మోన్ల స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది. సాధారణ ప్రసవమైతే త్వరగా నెలసరి మొదలవుతుందనేది అపోహే! సిజేరియన్‌ చేయించుకున్నా, సాధారణ ప్రసవం ద్వారా బిడ్డను కన్నా, తర్వాత  తొలి నెలసరి భిన్నమైన అంశాల ఆధారంగా మొదలవుతుంది. 


సి సెక్షన్‌ తర్వాత ఇలా...

ప్రసవం తర్వాత ప్రొజెస్టరాన్‌, ఈస్ట్రోజన్‌ హార్మోన్ల మోతాదులు తగ్గుతాయి. పాలిస్తున్నంత కాలం ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఫలితంగా నెలసరి ఆలస్యమవుతుంది. ఒకవేళ బిడ్డకు పాలివ్వకపోతే, సి సెక్షన్‌ తర్వాత ఐదు నుంచి ఆరు వారాల్లోనే తొలి నెలసరి మొదలవుతుంది. 


ప్రభావితం చేసే అంశాలు

కొన్ని ఆరోగ్య పరిస్థితులు నెలసరి మీద ప్రభావం చూపిస్తాయి. మరీ ముఖ్యంగా గర్భధారణకు పూర్వ ఆరోగ్య పరిస్థితులు సి సెక్షన్‌ తదనంతర నెలసరిని ప్రభావితం చేస్తాయి.


  • గర్భధారణకు పూర్వం ఉన్న ఆరోగ్య సమస్యలు
  • హార్మోన్ల హెచ్చుతగ్గులు
  • గర్భధారణకు పూర్వం నెలసరిలో అవకతవకలు


ఇతరత్రా కారణాలు

  • ఒత్తిడి
  • బరువు పెరగడం/ తగ్గడం
  • థైరాయిడ్‌ సమస్యలు
  • చురుకుదనం మందగించడం


నెలసరి ఇలా..

గర్భధారణకు ముందు నెలసరికీ, తర్వాతి నెలసరికీ తేడా ఉంటుంది. ప్రసవం తర్వాత శరీరం తిరిగి నెలసరికి అడ్జస్ట్‌ అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రసవానికి ముందు నెలసరిలా ప్రసవం తర్వాత ఉండదు. 


అధిక స్రావం: సి సెక్షన్‌ తర్వాత కనిపించే తొలి నెలసరిలో ఎక్కువ రక్తస్రావం కావొచ్చు. సర్జరీ సమయంలో గర్భాశయ గోడలకు కోత పెట్టడమే ఇందుకు కారణం. 


ముదురు ఎరుపు: ప్రసవం లేదా సి సెక్షన్‌ తర్వాత, గర్భాశయంలో తిరిగి తాజా కణజాలం తయారవుతుంది. కాబట్టి స్రావం ముదురు ఎరుపు రంగులో ఉంటుంది.


ఎక్కువ రోజులు: నెలసరి ప్రారంభంలో నాలుగు రోజుల పాటు ఎక్కువ స్రావం కనిపించి, తర్వాత తీవ్రత తగ్గుతుంది.


అవకతవకలు: బరువు పెరగడం, ఒత్తిడి, హార్మోన్‌ సమస్యల మూలంగా నెలసరిలో అవకతవకలు తలెత్తవచ్చు. 


రక్తపు గడ్డలు: ముదురు రంగుతో కూడిన రక్తపు గడ్డలు స్రావంలో కనిపించవచ్చు. మరీ ముఖ్యంగా తొలి నెలసరిలో ఈ పరిస్థితి సర్వసాధారణం. అలాగే థైరాయిడ్‌ లేదా అడినోమయోసిస్‌ సమస్యలు ఉన్నవాళ్లలో హెవీ బ్లీడింగ్‌ కనిపిస్తుంది. ఎండోమెట్రియోసిస్‌ (గర్భాశయం వెలుపల కణజాలం పెరిగే పరిస్థితి) ఉన్నవాళ్లలో లైట్‌ బ్లీడింగ్‌ కనిపిస్తుంది. 


పాలిచ్చినంత కాలం...

బిడ్డకు పాలిస్తున్నంత కాలం తల్లిలో నెలసరి కనిపించకపోవడానికి కారణం, ఆ సమయంలో శరీరంలో హార్మోన్లు ఉత్పత్తి అవుతూ ఉండడమే! పాల ఉత్పత్తికి తోడ్పడే ప్రొలాక్టిన్‌ అనే హార్మోన్‌ పునరుత్పత్తి హార్మోన్ల ఉత్పత్తిని తగ్గిస్తుంది. దాంతో అండాల తయారీ, విడుదల జరగవు. ఫలితంగా బిడ్డకు పాలిచ్చినంత కాలం తల్లుల్లో నెలసరి కనిపించదు


నెలసరి నొప్పులు దూరం

సి సెక్షన్‌ లేదా ప్రసవం తర్వాత నెలసరి నొప్పులు అదుపులోకొస్తాయి. గర్భధారణతో శరీరంలో చోటుచేసుకునే మార్పులే ఇందుకు కారణం.


ప్రమాద సూచనలు

నెలసరి మొదలైన తర్వాత కొన్ని సూచనలను నిర్లక్ష్యం చేయకుండా, వెంటనే అప్రమత్తమై వైద్యులను సంప్రతించాలి. 


అవేంటంటే...

  • ఒకటి రెండు గంటల్లో ప్యాడ్‌ మార్చవలసి రావడం
  • నొప్పితో కూడిన తీవ్ర స్రావం
  • హఠాత్తుగా జ్వరం, తలనొప్పి
  • అతి పెద్ద రక్తపు గడ్డలు
  • మూత్రవిసర్జన సమయంలో నొప్పి
  • దుర్వాసనతో కూడిన నెలసరి స్రావం

Updated Date - 2022-08-16T16:26:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising