ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Lose Weight And Stay Healthy: ఇలా నీళ్ళు తాగండి.. అలా బరువు తగ్గండి.

ABN, First Publish Date - 2022-09-02T20:27:11+05:30

బరువు తగ్గాలి అనుకోవడం ఇప్పుడు మామూలుగా అందరిలో ఉన్న సమస్య. అధిక బరువుతో బాధపడేవారు త్వరగా బరువు తగ్గాలంటే అది పానీయాలతో సులభం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బరువు తగ్గాలి అనుకోవడం ఇప్పుడు మామూలుగా అందరిలో ఉన్న సమస్య. అధిక బరువుతో బాధపడేవారు త్వరగా బరువు తగ్గాలంటే అది పానీయాలతో సులభం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.  వేసవిలో మన శరీరాలు సహజంగానే ద్రవపదార్థాల కోసం తహతహ లాడతాయి. అయితే మనలో చాలా మంది నీరు తాగడానికే చూస్తారు. ఈ నీటికి వేరే ఏం కలిపి తీసుకుంటే అవి ఆరోగ్యానికి మంచి చేసి అధిక బరువును తగ్గిస్తాయనేది చూద్దాం. 


కొత్తిమీర నీరు (Coriander Water)

ఒకటిన్నర కప్పుల వేడినీటిలో రెండు టీస్పూన్ల కొత్తిమీర కలపండి. మూతపెట్టి తక్కువ మంట మీద 15 నిమిషాలు ఉడకనివ్వాలి. మంటను ఆపి, నీటిని వడకట్టి, అది చల్లారిన తర్వాత,  టీస్పూన్ తేనె వేసి బాగా కలపాలి. 


కొత్తిమీర పానీయంతో ఆరోగ్య ప్రయోజనాలు: థైరాయిడ్, మధుమేహం, బరువు సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు సహాయపడుతుంది.


చర్మాన్ని శుభ్రపరుస్తుంది.


జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.


జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.


జలుబు తగ్గించడంలో సహాయపడుతుంది.


కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది.


నిమ్మ నీరు (Lemon water)

ఉదయం పూట ఒక వెచ్చని గ్లాసు నిమ్మకాయ నీళ్లలో తేనెతో కలిపి తాగడం వల్ల నిమ్మ నీరు మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.


జీర్ణక్రియకు సహాయపడుతుంది.


శరీరాన్ని యాక్టివ్ చేస్తుంది.


చర్మాన్ని శుభ్రపరుస్తుంది.


బరువు తగ్గడంలో సహాయపడుతుంది.


ఉసిరిక నీరు(Lemon water)

ఉసిరి ముక్కలను నీటిలో కొద్దిగా ఉప్పు వేసి నానబెట్టండి. ఒక రోజు అలాగే ఉంచి, ఆపై వడకట్టండి. మీ శరీరాన్ని యాక్టివ్ చేయడానికి ఈ నీటిని త్రాగండి. ఉసిరికాయను నీటితో కలిపి తయారుచేసిన ఉసిరి రసం విటమిన్ సి ని అందిస్తుంది. ఇది జుట్టు పెరుగుదలకు, బరువు తగ్గడంలోనూ సహాయపడుతుంది.


పవిత్ర తులసి నీరు (Indian Gooseberry Water)

ఆయుర్వేదంలో చాలా కాలంగా ఉపయోగించే మూలికలలో తులసి ఒకటి. ఇది అపారమైన ప్రయోజనకరమైన వైద్య లక్షణాలను కలింది. తులసి అన్ని రకాల వ్యాధులను నయం చేయడానికి సహాయపడుతుంది. తులసి ఆకులను నీటిలో రెండు ఎండుమిర్చి వేసి మరిగించి తులసి నీళ్లను తయారు చేయండి.


తులసి నీటి ప్రయోజనాలు: జ్వరం, ఇతర బాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది;రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. డెంగ్యూ, మలేరియా, హెపటైటిస్, క్షయ, స్వైన్ ఫ్లూ నుండి కోలుకోవడంలో సహాయపడుతుంది.


శరీరం, చర్మాన్ని ఆరోగ్యాంగా ఉంచుతుంది. 


యాంటీబయాటిక్, యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలను కలది.


శ్వాసకోశ వ్యాధులను అధిగమించడంలో సహాయపడుతుంది.


జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది;


ఇందులోని విటమిన్లు A, C మధుమేహ వ్యాధిగ్రస్తులకు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది.


దంత ఆరోగ్యాన్ని కాపాడుతుంది.


అల్లం నీరు (Ginger Water)

జింజర్ టీ, అల్లం నీటిని తాజాగా కట్ చేసిన అల్లం రూట్ ముక్కలను నీటితో ఉడకబెట్టి తయారుచేస్తారు. దీన్ని వడకట్టి, పర్ఫెక్ట్ టీని తయారు చేయడానికి కొంచెం తేనె కలపాలి.


కీళ్ల నొప్పులు, వాపును తగ్గిస్తుంది.


వికారం నుండి ఉపశమనం ఇస్తుంది.


యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది, ఇది శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్ సంఖ్యను తగ్గిస్తుంది.


యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలు దీనిలో ఎక్కువగా ఉంటాయి. 


జీర్ణక్రియలో సహాయపడుతుంది అలాగే జలుబుకు వ్యతిరేకంగా పోరాడటంలో సహాయపడుతుంది.


ఇది ఆకలిని అణిచివేస్తుంది, జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఆకలి బాధలను తగ్గించి బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

Updated Date - 2022-09-02T20:27:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising