breast feeding: బిడ్డకు తల్లిపాలు ఎన్నిసార్లు ఇవ్వాలి. ప్రత్యేకమైన ఆహారం తీసుకుంటే తల్లిపాలు రుచి మారుతుందా?
ABN, First Publish Date - 2022-08-29T18:06:32+05:30
శిశువుకు పాలను ప్రసవ గదిలోనుంచి బయటకు రావడంతోనే ఇవ్వడం మంచిది. ప్రతి రెండు గంటలకు బిడ్డకు ఆహారం అవసరం అవుతుంది.
తల్లి కావడం ఓ వరం. మరి పుట్టిన బిడ్డకు తల్లిపాలు సరిగా అందుతున్నాయా? అసలు రోజులో బిడ్డకు ఎన్నిసార్లు పాలు ఇవ్వాలి. బాలింత సమయంలో తల్లి ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి. అనే విషయంలో ఎప్పటికప్పుడు చాలా అనుమానాలే కలుగుతుంటాయి. అసలు బిడ్డకు రోజులో ఎన్నిసార్లు పాలు పట్టాలి?
అసలు తల్లిపాలను ఎప్పుడు ఇవ్వాలి.
పాలను తయారు చేసే గ్రంథులు ఏర్పడినప్పటికీ శిశువుకు పాలు ఇవ్వడం మొదలు పెట్టినపుడే పాలు ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. శిశువుకు పాలను ప్రసవ గదిలోనుంచి బయటకు రావడంతోనే ఇవ్వడం మంచిది. ప్రతి రెండు గంటలకు బిడ్డకు ఆహారం అవసరం అవుతుంది. అంటే రోజుకు ఎనిమిది నుంచి తొమ్మిది సార్లు బ్రెస్ట్ ఫీడింగ్ ఉండాలి.
నెలలు గడిచే కొద్దీ పాలు పట్టే సమయం తగ్గుతుంది. 5 నుంచి ఆరు సార్లు ఫీడింగ్ ఇస్తే సరిపోతుంది. బలహీనంగా ఉన్న శిశువుల్లోనూ, కాన్పు ముందుగానే జరిగి పుట్టిన శిశువులకు ఆహారం ఎక్కువగా అవసరం అవుతుంది. వీరికి పాలు తరచుగా ఇవ్వడం మంచిది.
పిల్లలకు ఆకలి వేస్తే ఎలా చెపుతారు.
పాలు తాగడానికి పిల్లలు నోరు చప్పరించడం, గట్టిగా ఏడవడం లాంటి సంకేతాలు ఇస్తారు. పెదవులు, నాలుకతో చప్పరించే శబ్దాలు చేస్తారు.
తల్లి శిశువుకు ఎలా పాలు పట్టాలి.
తల్లిపాలు పట్టడానికి పొజిషనింగ్ అవసరం. చనుమొనలను పట్టుకుని బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల సౌకర్యవంతంగా శిశువుకు పాలు అందుతాయి. కాళ్ళను మడిచి ఒడిలో వేసుకుని పాలు ఇవ్వడం వల్ల తల్లి ఎలాంటి నొప్పి కలగకుండా బిడ్డకు పాలు ఇవ్వచ్చు.
తల్లిపాలు ఎందుకు ఇవ్వాలి.
తల్లిపాలు బిడ్డను చాలా వ్యాధుల నుంచి కాపాడతాయి. ముఖ్యంగా SIDS నుంచి రక్షిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలు అధికంగా తల్లిపాలలో అందుతాయి. ప్రసవం కాగానే తల్లిపాలు జిగటగా ఉంటాయి. వారాలు గడిచే కొద్దీ పాలు పలుచగా జీర్ణం కావడానికి వీలుగా మారతాయి.
1. తల్లి పాలు ఇస్తున్నప్పుడు ఆకలి ఎక్కువగా ఉంటుంది. తల్లి పోషకాహారం తీసుకోవడం వల్ల బిడ్డకు పాల ద్వారా ఈ పోషకాలు అందుతాయి.
2. తల్లి పాలును శిశువుకు ఇచ్చే ముందు రొమ్ములను శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి.
3. రుతు క్రమం సరిగా లేదని పాలిచ్చే తల్లులు ఆందోళన పడనవసరం లేదు. పాలిచ్చే తల్లుల్లో రుతుక్రమం కాస్త నెమ్మదిగా మొదలవుతుంది.
4. తల్లిపాలకు ప్రత్యేకమైన రుచి. వాసనా ఉంటాయి. ఇవి ఆహారం ప్రత్యేకంగా తీసుకోవడం వల్ల మారవు. పోషకాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా బిడ్డకు పోషకాలతో నిండిన పాలు అందుతాయి. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు.
Updated Date - 2022-08-29T18:06:32+05:30 IST