ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కడుపు ఉబ్బరం వదలాలంటే...

ABN, First Publish Date - 2022-09-13T17:12:17+05:30

కొన్ని ఆహార పదార్థాల మూలంగానే ఈ సమస్య మొదలవుతుంది. కాబట్టి మందుల మీద ఆధారపడకుండా కారణాలను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొన్ని ఆహార పదార్థాల మూలంగానే ఈ సమస్య మొదలవుతుంది. కాబట్టి మందుల మీద ఆధారపడకుండా కారణాలను కనిపెట్టాలి. అవసరమైన చిట్కాలు పాటించాలి.


పప్పు దినుసులు: వీటిలో గ్యాలెక్టోలిగోశాక్రైడ్స్‌, ఫ్రక్టేన్స్‌ అనే శోషణ చెందని పిండి పదార్థాలుంటాయి. ఇవి పేగుల్లోని బ్యాక్టీరియాతో కలిసి, పులుస్తాయి. దాంతో వాయువులు వెలువడి, కడుపు ఉబ్బరం మొదలవుతుంది.

కొన్ని కూరగాయలు, పండ్లు: కాలీఫ్లవర్‌, క్యాబేజీ, క్యారెట్‌లలో స్టార్చ్‌ ఎక్కువ. అలాగే అప్రికాట్‌, ప్రూన్స్‌లో చక్కెరలు  ఎక్కువ. ఇవన్నీ బ్లోటింగ్‌కు దారి తీస్తాయి.

పాల ఉత్పత్తులు: ల్యాక్టోజ్‌ ఇన్‌టాలరెన్స్‌ ఉన్నవాళ్లు పాల ఉత్పత్తులు తీసుకున్నప్పుడు కడుపు ఉబ్బరం మొదలవుతుంది. 

స్వీటెనర్లు: కొందరు పదార్థాల నిల్వకు ఉపయోగించే ఫ్రక్టోజ్‌ను జీర్ణం చేసుకోలేరు. కృత్రిమ తీపి పదార్థాలలో ఉండే సార్బిటాల్‌ అనే రసాయనం తేలికగా జీర్ణం కాదు. కాబట్టి వీటిని తగ్గించుకోవాలి.


ఉపశమనం ఇలా

కామొమైల్‌ ఆయిల్‌: ఈ నూనె పొట్టలోని ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ఈ నూనెను పొట్ట మీద రాసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

జీలకర్ర ఆయిల్‌: ఇర్రిటబుల్‌ బోవెల్‌ సిండ్రోమ్‌ లాంటి సమస్యలకు ఈ నూనె చక్కని విరుగుడు. కాబట్టి ప్రతి రోజూ రాత్రి నిద్రకు ముందు ఈ నూనెతో పొట్టను మర్దన చేయాలి.

అల్లం నూనె: వాయువులు పేగుల గుండా బయటకు వెళ్లిపోడానికి ఈ నూనె తోడ్పడుతుంది. ఈ నూనెను పరగడుపున తీసుకోవాలి

పెప్పర్‌మింట్‌ ఆయిల్‌: దీన్లోని యూజెనాల్‌, థైమాల్‌ పేగులను ఆరోగ్యంగా ఉంచుతాయి. పేగుల్లో ఆహారం పులిసే ప్రక్రియకు అడ్డు పడతాయి. సమస్య తలెత్తినప్పుడు ఈ నూనెను తీసుకోవచ్చు.

Updated Date - 2022-09-13T17:12:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising