ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

fenugreek and coconut oil : మెంతులు, కొబ్బరి నూనె మిశ్రమం ఈ నాలుగు సమస్యలకు చెక్ పెడుతుంది.

ABN, First Publish Date - 2022-09-28T16:04:30+05:30

మెంతులు, కొబ్బరినూనె మిశ్రమం జుట్టుకు చాలా ఆరోగ్యకరమైన ఫలితాలను ఇస్తుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెంతులు, కొబ్బరినూనె మిశ్రమం జుట్టుకు చాలా ఆరోగ్యకరమైన ఫలితాలను ఇస్తుంది. ఇది తలకు పూయడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గతుంది. మెంతులు కొబ్బరి నూనె పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించడంలో సహకరిస్తుంది. ఈ ఒత్తిడితోనే జుట్టు రాలడం, వెంట్రుకలు జీవం కోల్పోవడం జరుగుతుంది.


తెల్లజుట్టు, చుండ్రు, మొదలైన సమస్యలు కూడా దీనితోనే వస్తాయి. ఈ సమస్యలతో బాధపడేవారు మెంతులు కొబ్బరి నూనె కలిపి రాయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. కొబ్బరి నూనె జుట్టును మృదువుగా మారుస్తుంది. మెంతి గింజలు జుట్టుకు పోటాషియాన్ని, మికోటినిక్ ఆమ్లాన్ని అందిస్తాయి. 


మెంతులు, కొబ్బరి నూనెతో మరిన్ని ప్రయోజనాలు...

1. జుట్టుకు బలాన్నిస్తాయి..

కొబ్బరినూనెలో మెంతి గింజలను కలిపి రాసుకుంటే జుట్టుకు బలాన్ని ఇస్తుంది. వారానికి రెండుసార్లు దీనిని వాడాలి. 


2. జుట్టుని నల్లగా మారుస్తుంది.

ఈ మిశ్రమాన్ని వారానికి రెండు సార్లు అఫ్లయ్ చేసుకుంటే తెల్లని జుట్టు నల్లగా మారుతుంది. ఇది జుట్టుకు పోషణను అందిస్తుంది. 


3. జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది.

జుట్టురాలే సమస్య నుంచి బయటపడేందుకు కొబ్బరినూనె మెంతులు బాగా ఉపయోగ పడతాయి. ఈ రెండింటిలోనూ విటమిన్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు రాలే సమస్యను దూరం చేస్తాయి.


4. చుండ్రును అరికడుతుంది.

కొబ్బరి నూనె మెంతిగింజలు మిశ్రమాన్ని జుట్టుకు పట్టించడం వల్ల తలచల్లగా ఉంటుంది. అధిక చమట ఇతర కారణాలతో తలలో పేరుకుపోయిన చుండ్రు కూడా తగ్గుతుంది. స్కాల్ఫ్ పై ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. చుండ్రు సమస్యను దూరం చేస్తుంది. 

Updated Date - 2022-09-28T16:04:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising