ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హరేమ్‌ హొయలు!

ABN, First Publish Date - 2022-01-19T05:30:00+05:30

‘ఎంత బాగున్నా, ఆ ప్యాంట్స్‌ మనకు సూట్‌ కావులే!’ అనిపిస్తుంది హరేమ్‌ ప్యాంట్స్‌ను చూస్తే! కానీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఎంత బాగున్నా, ఆ ప్యాంట్స్‌ మనకు సూట్‌ కావులే!’ అనిపిస్తుంది హరేమ్‌ ప్యాంట్స్‌ను చూస్తే! కానీ ఈ ప్యాంట్స్‌ నప్పాలంటే, వాటిని సరైన ఫుట్‌వేర్‌తో మ్యాచ్‌ చేయాలి. నడకలో హూందాతనం, బాడీ లాంగ్వేజ్‌లో ఆత్మస్థైర్యం ప్రతిబింబించేలా కదలాలి.


ఫ్యాబ్రిక్‌: షిఫాన్‌, సిల్క్‌ లేదా లైనింగ్‌తో కూడిన లైట్‌ మెటీరియల్స్‌తో తయారైన హరేమ్‌ ప్యాంట్స్‌ ఎంచుకోవాలి. శాటిన్‌, కాటన్‌ లాంటి బిగుతైన ఫ్యాబ్రిక్‌తో హరేమ్‌ ప్యాంట్‌ ఆకారం దెబ్బతింటుంది. 



మ్యాచింగ్‌ టాప్‌: నడుము దగ్గర కుట్టిన కుచ్చిళ్లు సమంగా ఉన్నాయో లేదో గమనించుకోవాలి. ప్యాంట్‌కు మ్యాచింగ్‌గా గాంజీస్‌ లేదా బిగుతైన బ్లౌజాన్స్‌, ట్యాంక్‌ టాప్స్‌ ధరించాలి. నడుము పైభాగం బొద్దుగా ఉండేవాళ్లు మోకాలి వరకూ ఉండే హరేమ్‌ను, ఫ్లేర్‌డ్‌ టాప్‌తో మ్యాచ్‌ చేయాలి.



ఫుట్‌వేర్‌: కనీసం మూడు అంగుళాల ఎత్తుండే హీల్స్‌ ఈ ప్యాంట్స్‌కు సూటవుతాయి. 

 ప్రింటెడ్‌ హరేమ్‌ ప్యాంట్‌ ధరించాలనుకుంటే, సాలిడ్‌ కలర్‌తో కూడిన టాప్‌ను ఎంచుకోవాలి.

 హరేమ్‌ ప్యాంట్‌ను క్యాజువల్స్‌లో భాగంగా కూడా ధరించవచ్చు. కుర్తీల కిందకూ ఇవి బాగుంటాయి.




హరేమ్‌ ప్యాంట్‌ కథ!

పొడవుగా ఉండి, యాంకిల్స్‌ దగ్గర పట్టేసినట్టు ఉండే బ్యాగీ ప్యాంటునే హరేమ్‌ ప్యాంట్‌ అంటారు. ప్రారంభంలో వీటిని హరేమ్‌ స్కర్ట్స్‌ అనేవారు. హరేమ్‌ ప్యాంట్స్‌/స్కర్ట్స్‌ సంస్కృతిని వెస్టర్న్‌ కల్చర్‌కు పరిచయం చేసిన వ్యక్తి పాల్‌ పొరియట్‌.


 ఈ మధ్యప్రాచ్య స్టైల్‌, టర్కిష్‌ ట్రౌజర్‌ అయిన సల్వార్‌ స్ఫూర్తిగా రూపొందింది. బ్యాగీ ప్యాంట్లు, బ్లూమర్లు, దక్షిణాసియాకు చెందిన షల్వార్‌, పటియాలా సల్వార్‌, బోస్నియాకు చెందిన సిర్వాల్‌, ఉక్రేనియాకు చెందిన షరోవరీ స్టైల్స్‌ హరేమ్‌ ప్యాంట్‌ నుంచే పుట్టుకొచ్చాయి.


Updated Date - 2022-01-19T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising