ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Good Food : పరగడుపున నెయ్యి తినాలి

ABN, First Publish Date - 2022-11-23T23:12:54+05:30

నెయ్యి తినాలంటే వెనకడుగేస్తాం. కానీ నిజానికి నెయ్యిని పరగడుపున కూడా తినవచ్చు. ఇలా తినడం వల్ల ఒరిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఆయుర్వేదం ఇలా చెప్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెయ్యి తినాలంటే వెనకడుగేస్తాం. కానీ నిజానికి నెయ్యిని పరగడుపున కూడా తినవచ్చు. ఇలా తినడం వల్ల ఒరిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఆయుర్వేదం ఇలా చెప్తోంది.

భోజన రుచిని పెంచే నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులుంటాయి. లెక్కలేనన్ని ఔషధ ప్రయోజనాలూ దాగి ఉంటాయి. నెయ్యితో చిన్న పేగుల శోషణ శక్తి పెరగడంతో పాటు, ఆహార నాళంలోని ఆమ్లత్వం పిహెచ్‌ తగ్గుతుంది. అస్తవ్యస్థ ఆహారశైలి, నిద్రలేమి, కదలకుండా ఎక్కువసేపు కూర్చుని ఉండే జీవనశైలి, యాంటీబయాటిక్స్‌ వాడకం... వీటన్నిటి మూలంగా పేగుల ఆరోగ్యం దెబ్బ తింటుంది. కాబట్టి పేగుల ఆరోగ్యాన్ని సరిదిద్దుకోవాలంటే, అందుకు తోడ్పడే నెయ్యిని పరగడుపున తినాలి. ఇందుకోసం ఉదయాన్నే పరగడుపున ఒక టీస్పూను స్వచ్ఛమైన నెయ్యిని క్రమం తప్పక తినాలి.

ఆరోగ్య ప్రయోజనాలు...

  • జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది.

  • చర్మం కాంతివంతమవుతుంది.

  • మలమూత్ర విసర్జనలు గాడిన పడతాయి.

  • ఆకలి అదుపులో ఉంటుంది. కాబట్టి బరువు తగ్గుతాం.

  • పేగులకు మేలు చేసే ఎంజైమ్స్‌ నెయ్యిలో ఉంటాయి. కాబట్టి పేగుల ఆరోగ్యం మెరుగు పడుతుంది.

Updated Date - 2022-11-23T23:12:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising