ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందం కోసం... అలాంటి త్యాగాలొద్దు!

ABN, First Publish Date - 2022-06-19T07:52:31+05:30

‘వాస్తవానికి అవకాశాల్ని ఎవరూ వదులుకోరు. అయితే తొలి రోజుల్లోనే వచ్చిన ప్రతి అవకాశానికీ గంతేయలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘నువ్విలా’, ‘గౌరవం’, ‘కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌’ చిత్రాల్లో నటించిన కథానాయిక యామీ గౌతమ్‌. ఈ చండీగఢ్‌ భామ బ్యూటీకేర్‌ ప్రకటనల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. బాలీవుడ్‌లో ‘ఉడీ- ది సర్జికల్‌ స్ట్రయిక్‌’, ‘బాల’ లాంటి చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు చేసిన యామీ.. ప్రస్తుతం ‘ఓఎమ్‌జీ 2’లో నటిస్తోంది. తక్కువ సినిమాల్లో నటించినా.. ఆమె నటించిన పాత్రలు అందరికీ గుర్తుండిపోతాయి.  


‘‘వాస్తవానికి అవకాశాల్ని ఎవరూ వదులుకోరు. అయితే తొలి రోజుల్లోనే వచ్చిన ప్రతి అవకాశానికీ గంతేయలేదు. పెర్ఫార్మర్‌గా మంచి పేరు తెచ్చుకోవాలనే ఆలోచన నాది. క్రియేటివ్‌ ఫీల్డ్‌లో జనాలను కలిసేకొద్దీ, అపజయాలు ఎదురయ్యేకొద్దీ మనకు మనం మారతాం. స్ట్రగుల్‌ ఎప్పటికీ ఉంటుంది. ఆత్మవిశ్వాసం, సహనంతో ఉండాల్సిందే. మహిళా ప్రాధాన్య చిత్రాలను చూసినప్పుడు పొంగిపోతాను. ఓ మహిళ బలమైన పాత్రల్లో నటించిందంటే.. ఆమెకు అవకాశాలు క్యూ కట్టినట్లే కదా! 


లేకుంటే ఇక్కడ నిలబడలేం... 

కెరీర్‌ తొలిరోజుల్లో ఏదైనా కొత్తగా కనిపించాలనుకున్నప్పుడు ‘విక్కీ డోనర్‌’లో అవకాశం వచ్చింది. అది నా దారినే మార్చివేసింది. అంతెందుకు... ఈ మధ్యకాలంలో చేసిన ‘బాల’ చిత్రంలో టిక్‌టాక్‌ ఇన్‌ఫ్లూయన్స్‌ అమ్మాయిగా నటించా. అలాంటి హాస్యపాత్రలు ఎంచుకోవడానికి కొందరు జంకుతారు. నాకలాంటి అందోళన లేదు. ఫలానా పాత్ర వర్కవుట్‌ అవుతుందనే విషయం స్ర్కిప్ట్‌ చదువుతున్నప్పుడే అర్థమవుతుంది. నా సహనటుల డైలాగ్స్‌, బాడీ లాంగ్వేజ్‌ను గుర్తుంచుకుంటా. వచ్చిన పాత్ర కోసం హార్డ్‌వర్క్‌ చేయాలి. లేకుంటే ఇక్కడ నిలబడటం కష్టం. మనకు మనమే పోటీగా ఉండాలి. 


ఇలా చేయడం మంచిది కాదు..

అందమంటే సహజంగా ఉండాలి. మేం యాడ్స్‌, సినిమాల్లో అందంగా కనిపిస్తాం. అదంతా మేకప్‌ టీమ్‌ మహిమ. ముక్కు సరిగా లేకున్నా.. మేకప్‌తో మాయ చేస్తారు. ఇది తెలీకుండా మాలా కనిపించాలనే తాపాత్రయం వద్దు. చండీగఢ్‌లో మా పక్కింటి అమ్మాయి ఓ సెలబ్రిటీ ఇంటర్వ్యూ చూసింది. ఆ హీరోయిన్‌లా డైట్‌ పాటిం చాలని రోజుకో నారింజ మాత్రమే తిన్నదట. వారంలోపు ఆసుపత్రిపాలైంది. తెరమీద చూసి మా మాదిరి కావాలని మీరు త్యాగాలు చేయద్దు. మీ బాడీ సైజ్‌, రూపం మార్చుకోవటం కష్టం. ఇక నేను ఇంటి ఆహారాన్నే ఇష్టపడతా. రుచికరమైన ఆహారం లాగిస్తా. దానికి తగ్గ వర్కవుట్స్‌ చేస్తా. 


ఆడపిల్లలు చదుకోవాలి... 

పర్యావరణ పరిరక్షణకు నా వంతు సహకరిస్తా. ఇంట్లో ప్లాస్టిక్‌ వాడను. ఇంట్లో ఉంటే కరెంట్‌ ఖర్చు చేయను. నా లైఫ్‌స్టయిలే కాదు.. పర్యావరణాన్ని పాడుచేసేవారికి అవగాహన కూడా కలిగిస్తా. అంతెదుకూ.. ఓసారి ఎయిర్‌పోర్టులో ప్లాస్టిక్‌ కవర్‌ విసిరేస్తే ‘అలా చేయడం మంచిది కాద’ని చెప్పా. మనకేం కాదని ఎవరికి వారు అలా వదిలేయద్దు. కరోనా సమయంలో మినిమమ్‌ హైజీన్‌తో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలనే ఆలోచన జనాలకు వచ్చింది. మీ కిడ్స్‌కు హైజీన్‌గా ఉండమని చెబితే.. వారే పెద్దయ్యాక తరం మారుతుంది. ఇకపోతే ముఖ్యంగా ఆడపిల్లలు చదువుకోవాలి. మహిళ ఎడ్యుకేట్‌ అయితే కుటుంబం బాగుపడుతుంది. చదువుకున్నప్పుడే ఆత్మవిశ్వాసంతోపాటు సమానత్వమూ వస్తుంది. అచీవ్‌మెంట్‌, యాంబిషన్‌, సక్సెస్‌.. అనే మాటలు ప్రతి మనిషికీ మారిపోతాయి. నా విషయానికొస్తే.. హ్యాపీగా ఉండాలి. చుట్టూ ఉండేవాళ్లు సంతోషంగా ఉండాలి. హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో ఓ ఫామ్‌ ఉంది. అక్కడ ఉన్నప్పుడు ఆ ప్రకృతి, ఆ సహజమైన గాలి, ఆ పల్లె మనుషులు గొప్పగా అనిపిస్తారు. చాలా సింపుల్‌  లైఫ్‌, చిన్న ఆనందాలే అద్భుతంగా ఉంటాయి.’’ 

Updated Date - 2022-06-19T07:52:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising