ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

relationship advice: బంధంలో తరచుగా గొడవలు పడుతున్నారా?

ABN, First Publish Date - 2022-11-10T12:40:54+05:30

గొడవ తరువాత సర్దుకుపోవడం కూడా ఉండనే ఉంటుంది. ఇలాంటివన్నీ ప్రేమలో వచ్చి పోతూ ఉంటాయి.

relationship
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రేమలో ఉండటం అనేది ఒక అద్భుతమైన అనుభూతి. ఒకరికి ఒకరు దగ్గరకావడం అంటే ఎడతెగని ఉత్సాహం, ఒకరి కోసం ఒకరు ఆరాటపడటం ఉంటూనే అప్పుడప్పుడూ గొడవలు పడటం ఆపై సర్దుకుపోవడం లాంటివన్నీ వస్తూ పోతూ ఉంటాయి. ఇక ఈ మధ్యలో ముఖ్యమైన శృంగారం కూడా సంతోషంగా, సంతృప్తిగా సాగిపోవాలన్నా కూడా చాలా విషయాలకు రాజీ పడిపోతూ కాస్త అవగాహనతో సాగిపోవడం అవసరం. ఎప్పుడైనా పరిస్థితి చేయిదాటిపోతుందనే సమయానికి ఈ సలహాలను పాటించి చూడండి.

1. ఒకరి మనసులను ఒకరు గౌరవించుకోండి. ఇద్దరూ రెండు భిన్నమైన మనస్సుల వారు అయితే ఆచరణాత్మకంగా ప్రతిదాని గురించి భిన్నంగా ఆలోచిస్తారు. చిన్న చిన్న పొరపొచ్చాలు వచ్చినా సర్దుకునే గుణం కావాలి.

2. కనెక్ట్ చేయడానికి డిస్‌కనెక్ట్ చేయండి. సోషల్ మీడియా, ఇంటర్నెట్ సాధారణంగా ఒకరిపై ఒకరు ఒత్తిడిని కలిగిస్తాయి. గదిలో మీరిద్దరూ మాత్రమే ఉంటే కలిసి భోజనం చేయండి. ఇద్దరి మధ్యలో జరిగిపోయిన పాత విషయాలను గురతుంచుకున్న మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకోండి.

3. సంబంధాన్ని పూర్తిగా పాడు చేసే వాటిలోఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవడం ఒకటి. వ్యక్తిత్వంలో వచ్చే మార్పులు, ఆసక్తులు, లక్ష్యాలలో ఆకస్మిక మార్పు మోసానికి సంకేతం అని చాలా మంది నమ్ముతారు. అసలు మీరు ఉన్నది సరైన మార్గంలోనేనా అనేది గమనించుకోవాలి. మీ ఇద్దరి మధ్యా వచ్చిన మార్పుకు ఎవరు బాధ్యులో కూడా గమనించాలి. వీలైతే మార్పును సవరించే విధంగా ఆలోచించాలి. వ్యక్తిత్వంలో మార్పురావడానికి మధ్య మీ పాత్ర ఏమైనా ఉందేమో చూసుకోవాలి.

4. సంబంధంలో భావోద్వేగ దూరం: ఇద్దరికీ దూరం పెరుగుతుందని అనిపించాకా.. లింగభేధం లేకుండా ఈగోలకు పోకుండా సారీ చెప్పేసుకుని పరిస్థితిని చక్కదిద్దుకుంటే సమస్యలు పెద్దవి కావు. ఇద్దరూ పట్టుగా ఉంటే దూరం పెరిగే అవకాశం ఉంటుంది.

5. బాధ్యతలు పంచుకోండి..పొరపాట్లు దొల్లాయని తెలిసాకా సారీ చెప్పకుండా సాగదీయకండి. ఇంటి బాధ్యతలను కలిసి పంచుకోండి. మనసులో మాటలు నచ్చిన పని చేసి తెలియపరచండి. ఇది ఇద్దరినీ మరింత దగ్గర చేస్తుంది.

Updated Date - 2022-11-10T12:54:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising