ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Apology to your partner: మీ పార్టనర్ కి ఇలా సారీ చెప్పేయండి.

ABN, First Publish Date - 2022-08-08T16:25:12+05:30

చిన్న తగాదానో, వాదులాటో వచ్చిందంటే మీ ఇద్దరిలో ఎవరు ముందుగా సారీ చెప్పి వాతావరణాన్ని చల్లబడేట్టు చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భార్యాభర్తల మధ్య తగవులు రాని సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రతివాటికీ ఒకరే సారీ చెప్పాలనే బింకాన్ని పక్కన పెట్టి చూస్తే.. తగవు క్షణంలో పోయి ఆనందం అలముకుంటుంది. అయితే ఇలా చేస్తున్నామా? గమనించుకోండి. చిన్న తగాదానో, వాదులాటో వచ్చిందంటే మీ ఇద్దరిలో ఎవరు ముందుగా సారీ చెప్పి వాతావరణాన్ని చల్లబడేట్టు చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరు తమ ఇగోను పక్కన పెట్టి ఆలోచిస్తున్నారు.. మీలో ఆ లక్షణం ఇప్పటి వరకూ లేకపోతే తగవును మీరే పెంచుతున్నట్టు... కాస్త పట్టు వదిలి దిగి వస్తే.. మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా.. 


ఇప్పటి కాలం భార్యాభర్తలు ఇగోలకు పోవడం అనేది కొత్తగా జరుగుతున్న విషయం కాదు. ఇద్దరూ ఉన్నత చదువులు చదవడం వల్లనో, పెద్ద ఉద్యోగాలు, ఆర్థికపరమైన వెసులుబాటు ఎవరూ ఎక్కువకాదనే స్వభావమో అహం, అహంకారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దీనితో తరచుగా వాదులాట, గొడవలు వస్తూనే ఉంటాయి. గొడవ సర్దుమణగాలంటే ఈ చిట్కాలతో సారీతో రాజీకి ప్రయత్నించండి.


Apology to your partner: తప్పులు చేయడం మానవ స్వభావం. మనం ఏదో ఒక విషయంలో తప్పులు చేస్తూనే ఉంటాం. చాలా సార్లు మన భాగస్వామి ఈ పొరపాటును గమనించినప్పటికీ, పెద్దగా స్పందించి మన తప్పును ఎత్తి చూపకపోవచ్చు. దీనిని అలుసుగా తీసుకుని ఏదైనా తగవు రాగానే ఒకరే రాజీకు దిగాలని బింకం ప్రదర్శించకండి. ఇది ఇద్దరి మధ్యా ఇంకా పెద్ద అగాధాన్ని తెచ్చి పెడుతుంది. ముందుగా మీరే క్షమాపణ చెప్పడంలో ఆలస్యం చేయకూడదు.


ఇలా క్షమాపణ చెప్పండి.

క్షమాపణ చెప్పాలని నిర్ణయించుకున్నాకా.. ముందు ఇద్దరి మధ్యా జరిగిన గొడవకు సంబంధించి వాదులాటను, వాదనను దానివల్ల కలిగిన అశాంతి నుంచి బయటపడాలి. తరువాత తక్కువ స్వరంతో మృదువుగా సారీ చెప్పేందుకు మీ పార్టనర్ తో మాటలు కలిపి జరిగిన దాంట్లో తప్పు ఒప్పులు పక్కన పెట్టి మీరే ముందుగా సారీ చెప్పేయండి. దీనితో ఒకరిపై ఒకరికి గౌరవం పెరుగుతుంది. 


మీరు ఇంత దిగివచ్చినా ఎదుటివారు కోపంగానే ఉన్నారంటే వారి మనసు ఇంకా గొడవ తాలూకు మాటల మీదనే ఉందనేది అర్థం చేసుకోండి. మరోసారి కూడా మీరే సారి చెప్పేందుకు వెనుకాడరనే ధీమాతో సారీ చెప్పి విషయాన్ని తేలిక చేయండి. మీ మాటల వల్ల ఎదుటివారికి కలిగిన బాధను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు తప్పు చేసి ఉంటే, దానిని ఒప్పుకోడానికి, ఏదో సాకు చెప్పడానికి బదులుగా, నేరుగా క్షమాపణ చెప్పడం వల్ల విషయాన్ని తేలికపరిచిన వారు అవుతారు. 


Updated Date - 2022-08-08T16:25:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising