ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నానబెట్టినవే తినాలెందుకు?

ABN, First Publish Date - 2022-01-22T05:30:00+05:30

కొన్ని గింజల్ని నానబెట్టినవే తినాలి. ముఖ్యంగా బాదం గింజల్ని కచ్చితంగా రాత్రంతా నానబెట్టుకుని ఉదయాన్నే తినాలి. ఇలా ఎందుకు తినాలని మీరెప్పుడైనా ఆలోచించారా? వాస్తవానికి ఆయుర్వేద శాస్త్రంలో ఈ విషయం ఉంది. బాదం గింజలు జీర్ణం కావటం కష్టం. ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొన్ని గింజల్ని నానబెట్టినవే తినాలి. ముఖ్యంగా బాదం గింజల్ని కచ్చితంగా రాత్రంతా నానబెట్టుకుని ఉదయాన్నే తినాలి. ఇలా ఎందుకు తినాలని మీరెప్పుడైనా ఆలోచించారా? వాస్తవానికి ఆయుర్వేద శాస్త్రంలో ఈ విషయం ఉంది. బాదం గింజలు జీర్ణం కావటం కష్టం. ముఖ్యంగా వాటి పొట్టులో యాంటీ న్యూట్రియంట్లు, ఫైటిక్‌ ఆసిడ్‌ ఉంటుంది. ఇది పిత్తాశయానికి సమస్య తెస్తుంది. అందుకే రాత్రిపూట నానబెట్టుకుని ఉదయాన్నే వాటి తోలు వలిచి తినాలి. రోజూ ఉదయాన్నే ఐదారు బాదం గింజలు తినటం ఆరోగ్యానికి మంచిదే. చర్మ సంరక్షణకు మేలు చేస్తాయి. ముఖ్యంగా మెదడు ఆరోగ్యానికి ఉపయోగడతాయివి. హై బ్లడ్‌ ప్రెషర్‌ను అదుపులో ఉంచే గుణం వీటికుంది. గుండె ఆరోగ్యానికి మంచిది. శరీరంలోని కొలెస్ర్టాల్‌ లెవల్‌ తగ్గిస్తుంది. పండ్లు, ఎముకల వృద్ధికి తోడ్పడుతాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. జీవక్రియలు సాఫీగా జరిగేట్లు చేస్తాయి. 


23 బాదం గింజల్లో 164 కేలరీలుంటాయి. ఫ్యాట్‌-14.1 గ్రాములు, సోడియం -0.3 గ్రాములు, కార్బొహైడ్రేట్స్‌- 6.1 గ్రాములు, ఫైబర్‌ 3.5 గ్రాములు, చక్కెశాతం-1.2 గ్రాములు, ప్రొటీన్‌-6 గ్రాములు ఉంటుంది. అందుకే ఉదయాన్నే ఆరేడు బాదం గింజలు తినటం ఆరోగ్యానికెంతో మంచిది. 

Updated Date - 2022-01-22T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising