ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలివిగా తినాలి

ABN, First Publish Date - 2022-07-05T08:25:36+05:30

ఆకలేస్తే తప్పనిసరిగా తినాల్సిందే! కానీ పోషకాల ఆధారంగా, పదార్థాలను పరిమితి మేరకు తినడం అలవాటు చేసుకోవాలి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

    ఆకలేస్తే తప్పనిసరిగా తినాల్సిందే! కానీ పోషకాల ఆధారంగా, పదార్థాలను పరిమితి మేరకు తినడం అలవాటు చేసుకోవాలి. అన్ని రకాల పోషకాలు అందే భిన్నమైన పదార్థాలకు ఆహారంలో చోటు కల్పించాలి. ఇలాంటి స్మార్ట్‌ ఈటింగ్‌ అలవాటు చేసుకుంటే, వయసు పైబడుతున్నా రుగ్మతలు దరి చేరకుండా ఉంటాయి. 


పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, ప్రొటీన్‌, డైరీ... వీటిని ప్రతి రోజూ తినాలి లేదా తాగాలి. ఆరోగ్యంగా ఉండడం కోసం వీటిలో ‘వెరైటీ’ని అనుసరించాలి. అలాగే లీన్‌ ప్రొటీన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.

అధిక క్యాలరీలు, అదనపు చక్కెరలు, సోడియం, శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ ఉండే పదార్థాలను మానేయాలి. బదులుగా తాజా పండ్లు, కూరగాయలు ఎంచుకోవాలి.

బంగాళాదుంప చిప్స్‌ లాంటి అధిక క్యాలరీలుండే పదార్థాలకు బదులుగా పోషకాలతో నిండిన క్యారెట్లు, మొలకలు తినొచ్చు.

బనానా బిస్కెట్స్‌ లాంటి పండ్ల ఉత్పత్తులకు బదులుగా తాజా పండ్ల ముక్కలకు పెరుగు జోడించి తింటే పోషకాలతో పాటు అదనపు ప్రొటీన్‌ కూడా దక్కుతుంది.

కూల్‌ డ్రింక్స్‌, ఎనర్జీ డ్రింక్స్‌కు బదులుగా పండ్లు, కీరా ముక్కలు కలిపిన నీళ్లు తాగాలి. 

పదార్థాల విషయంలో వెరైటీ అనే సూత్రాన్ని పాటించాలి. కొన్ని కూరగాయలు, పండ్లు, కొన్ని పప్పుదినుసులు, కొన్ని నట్స్‌కే పరిమితం కాకుండా, అన్ని రకాల పండ్లు, కూరగాయలు తింటూ ఉండాలి.

Updated Date - 2022-07-05T08:25:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising