ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుర్గా నవరాత్రులు

ABN, First Publish Date - 2022-09-29T09:42:53+05:30

విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ వారు... శరన్నవరాత్రి మహోత్సవాల్లో నాలుగో రోజున అన్నపూర్ణాదేవి అలంకారంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేటి అలంకారం శ్రీ అన్నపూర్ణాదేవి అశ్వయుజ శుద్ధ చవితి, గురువారం 

విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ వారు... శరన్నవరాత్రి మహోత్సవాల్లో నాలుగో రోజున అన్నపూర్ణాదేవి అలంకారంలో... చేతిలో అక్షయమైన అన్నపాత్ర ధరించి... భక్తులకు దర్శనమిస్తారు. అన్నపూర్ణాదేవి సకల జీవరాశులకు ఆహారాన్ని అందించే దేవత. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం సర్వజీవనాధారం. జీవుల ఆకలిని తీర్చడం కన్నా మించినది ఏదీ లేదు. అందుకే అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదంటారు. అలాంటి అన్నాన్ని ప్రసాదించేది అన్నపూర్ణాదేవి. ఆమె నిత్యాన్నదానేశ్వరి. సాక్షాత్తూ శివ స్వరూపిణి. ఈశ్వరుడికి భిక్ష పెట్టిన దేవత. ఆ తల్లిని ధ్యానిస్తే ధన , ధాన్య వృద్ధి, మధుర భాషణం, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయని పెద్దలు చెబుతారు. ఆమెను కొలిచిన వారికి అపారమైన సిరి సంపదలు కలుగుతాయనీ, మేధాశక్తి వృద్ధి చెందుతుందనీ నమ్మిక. అన్నపూర్ణాదేవిని కుంకుమతో పూజించాలి. జ్ఞానభిక్ష పెట్టాలనీ, వైరాగ్యం కలగజేయాలనీ కోరుకోవాలి. 


నైవేద్యం: దద్ధ్యోజనం, కట్టె పొంగలి, పరమాన్నం

అలంకరించే చీర రంగు: పసుపు

అర్చించే పూల రంగు: తెలుపు

పారాయణ చేయాల్సినవి: అన్నపూర్ణాష్టకం

Updated Date - 2022-09-29T09:42:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising