ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫొటోస్‌ నుంచి టెక్ట్స్‌ కాపీ!

ABN, First Publish Date - 2022-06-18T09:32:41+05:30

ఫొటోలో ఉన్న టెక్స్ట్‌ను కాపీ చేయడంలో ఆండ్రాయిడ్‌ ముందడుగు వేసింది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఉపయోగించి ఫొటో కంటెంట్‌ను సంగ్రహించే ఏర్పాట్లు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫొటోలో ఉన్న టెక్స్ట్‌ను కాపీ చేయడంలో ఆండ్రాయిడ్‌ ముందడుగు వేసింది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఉపయోగించి ఫొటో కంటెంట్‌ను సంగ్రహించే ఏర్పాట్లు చేసింది. ఫొటో నుంచి టెక్స్ట్‌ను కాపీచేసి పేస్ట్‌ చేసుకునేందుకు అనువుగా ఈ టెక్నాలజీ అప్లికేషన్‌ ఉంటుంది. ఒక పుస్తకం నుంచి తీసుకున్న పేజీని ఫొటో తీసుకున్న తరవాత దాన్ని డాక్యుమెంట్‌గా లేదంటే నోట్‌గా మార్చుకోవచ్చు. కెమెరా యాప్‌నకు చెందిన కెమెరా రోల్‌ సహాయంతో ఈ పని సాధ్యమవుతుంది. వర్డ్‌ ప్రాసెసింగ్‌ యాప్‌ అలాగే నోట్స్‌లో ఈ ఫీచర్‌ పనిచేస్తుంది. ఉదాహరణకు గూగుల్‌ లెన్స్‌ తన యూజర్లను ఇమేజ్‌ టెక్స్ట్‌ను కాపీ చేసుకునేందుకు అనుమతిస్తుంది. దాన్ని ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌, పీసీ డివైస్‌ల్లో ఉపయోగించుకోవచ్చు. ఇదెలాగంటే...

స్మార్ట్‌ఫోన్‌ గ్యాలరీ ఓపెన్‌ చేసుకుని, టెక్స్ట్‌ను చేసుకోవాలని అనుకుంటున్న ఇమేజ్‌ని సెలెక్ట్‌ చేసుకోవాలి. 

స్ర్కీన్‌ టాప్‌ రైట్‌ కార్నర్‌లో ఉన్న లెన్స్‌ ఐకాన్‌ను టాప్‌ చేయాలి.

లెన్స్‌ ఐకాన్‌ కాస్తా గూగుల్‌ లెన్స్‌ దగ్గరకు తీసుకెళుతుంది.

టెక్స్ట్‌ ఆప్షన్‌ను టాప్‌ చేసి, కాపీ చేయాలనుకుంటున్న టెక్స్ట్‌ను సెలెక్ట్‌ చేయాలి.

కాపీ టెక్స్ట్‌పై క్లిక్‌ చేయాలి. క్లిప్‌ బోర్డ్‌పై టెక్స్ట్‌ కాపీ అవుతుంది. 

ఒక వేళ ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్‌ గ్యాలరీకి ఇన్‌-బిల్ట్‌ లెన్స్‌ ఆప్షన్‌ లేనిపక్షంలో కాపీ చేసేందుకు గూగుల్‌ లెన్స్‌ యాప్‌ ఉపయోగించుకోవాలి. 

గూగుల్‌ ఫొటో్‌సను ఓపెన్‌ చేయాలి.

టెక్స్ట్‌ ఫారమ్‌లోకి కాపీ చేయాలని అనుకుంటున్న ఇమేజ్‌ని తీసుకోవాలి. 

లెన్స్‌ ఆప్షన్‌ని టాప్‌ చేయాలి. స్ర్కీన్‌ అడుగున ఇది అందుబాటులో ఉంటుంది. 

టెక్స్ట్‌ ఆప్షన్‌ని టాప్‌ చేయాలి. కాపీ చేయాలని అనుకుంటున్న టెక్స్ట్‌ని సెలెక్ట్‌ చేయాలి. 

కాపీ టెక్స్ట్‌పై క్లిక్‌ చేయాలి. 

Updated Date - 2022-06-18T09:32:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising